Aryan Khan బెయిల్ Surety పై సంతకం చేసిన సెలబ్రిటీ ఎవరంటే..

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ముంబై హై కోర్టు ఆర్యన్ ఖాన్‌కు పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అంతే కాదు ఓ ప్రముఖ వ్యక్తి పూర్తి బాధ్యత వహిస్తూ పూచీకత్తుపై సంతకాలు చేయాలని ఆదేశించింది. ఆ బాధ్యతను బాలీవుడ్ హీరోయిన్, షారూక్ స్నేహితురాలు జుహీ చావ్లా స్వీకరించింది. ఆర్యన్‌ బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్‌ పేపర్లపై జుహీ చావ్లా సంతకం చేసింది. అందుకోసం ఆమె ముంబై సెషన్స్ కోర్టుకు వెళ్లింది. 


అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. `ప్రస్తుతానికి ఆర్యన్ బెయిల్‌పై బయటకు రావడమే అన్నింటి కంటే ముఖ్యమ`ని జుహీ పేర్కొంది. ఒకవేళ ఆర్యన్‌ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే దానికి జూహీ చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాగా, ష్యూరిటీ లభించడంతో ఈ రోజు (శనివారం) బెయిల్‌ పత్రాలు ఆర్యన్‌ ఉన్న ఆర్థర్‌ రోడ్‌ జైలుకు వెళతాయి. ఆ తర్వాత ఆర్యన్ జైలు నుంచి బయటకు వస్తాడు. షారూక్ ఖాన్, జుహీ చావ్లా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో కలిసి నటించారు. అంతేకాదు.. వీరిద్దరూ వ్యాపార భాగస్వాములు కూడా. వీరిద్దరూ సంయుక్తంగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీని దక్కించుకున్నారు. 


Advertisement

Bollywoodమరిన్ని...