Abn logo
Jul 8 2020 @ 14:03PM

ఎట్టకేలకు కలుస్తున్న షారూక్, హిరాణీ!

చేసింది తక్కువ సినిమాలే అయినా అగ్ర దర్శకుడిగా ఎదిగారు రాజ్‌కుమార్ హిరాణీ. `మున్నాబాయ్ ఎమ్‌బీబీఎస్`, `త్రీఇడియెట్స్`, `పీకే` వంటి చిత్రాలతో విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్నారు. షారూక్‌ను బాగా ఇష్టపడే హిరాణీ అతనితో సినిమా చేయడానికి గతంలో రెండుసార్లు ప్రయత్నించారు. షారూక్ తిరస్కరించిన తర్వాతే `త్రీఇడియెట్స్`, `పీకే` చిత్రాలు  ఆమిర్ ఖాతాలోకి చేరాయట. 


గత రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న షారూక్.. రాజ్‌కుమార్ సినిమాతో మళ్లీ అభిమానుల ముందుకు రాబోతున్నాడట. రాజ్‌కుమార్ గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా హాస్యభరితంగా, ఎమోషనల్‌గా ఉంటుందట. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన వెంటనే విదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారట. ఈ సినిమాలో షారూక్ సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడట. 


Advertisement
Advertisement
Advertisement