వేడుకలన్నింటికీ దూరంగా Shah Rukh Khan కుటుంబం!

ప్రతి ఏడాది నవంబర్ వచ్చిందంటే బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అందుకు కారణం.. నవంబర్ రెండో తేదీన షారూక్ జన్మదినోత్సవం, నవంబర్ 13న ఆర్యన్ జన్మదినోత్సవం ఉండడమే. షారూక్ జన్మదినోత్సవం రోజున అతని నివాసం మన్మత్ ముందు అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. షారూక్ కూడా ఇంటి బయటకు వచ్చి అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. ఈ సారి ఈ వేడుకలకు దీపావళి కూడా తోడైంది. 


దీంతో షారూక్ కుటుంబంలో నవంబర్ అంతా సందడిగానే ఉంటుంది. అయితే ఈ ఏడాది వేడుకలన్నింటికీ దూరంగా ఉండాలని షారూక్ భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో షారూక్ కుటంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆర్యన్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇంటికి చేరినా ఆర్యన్ డిప్రెషన్‌లోనే ఉన్నాడట. ఈ నేపథ్యంలో నిరాడంబరంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే పుట్టినరోజు జరుపుకోవాలని షారూక్ భావిస్తున్నాడట. అభిమానులెవరూ తన ఇంటి వద్దకు రావొద్దని ఇప్పటికే షారూక్ విజ్ఞప్తి చేశాడట. 

Advertisement

Bollywoodమరిన్ని...