Oct 27 2021 @ 16:09PM

విమానాశ్రయంలోనే Shahrukh Khan ను ఆపేసిన Sameer Wankhede.. 4 గంటల పాటు విచారణ.. వైరల్ అవుతున్న పదేళ్ల క్రితం నాటి ఘటన..!

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టైన నాటి నుంచి ఆ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కూడా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇటీవల సమీర్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన విమర్శలను సమీర్, ఆయన భార్య క్రాంతి కూడా తిప్పికొట్టారు. ప్రస్తుతం ఆర్యన్‌కు బెయిల్ దొరక్కుండా చేస్తున్న సమీర్ గతంలో షారూక్‌కు కూడా చుక్కలు చూపించారు. పదేళ్ల క్రితం ముంబై ఎయిర్‌పోర్టులో షారూక్‌ను నాలుగు గంటల పాటు ఆపేశారు. 


2010లో హాలెండ్, లండన్‌లలో విహార యాత్ర ముగించుకుని షారూక్ ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. తనతో పాటు 20 బ్యాగ్‌లను తీసుకొచ్చారు. ఆ బ్యాగుల్లో విదేశీ వస్తువులున్నాయి. ఆ సమయంలో సమీర్ వాంఖడే ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఆఫీస్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కస్టమ్స్ ఛార్జ్ చెల్లించుకుండా విదేశీ వస్తువులను దేశంలోకి తీసుకువస్తున్నారని తెలిసి షారూక్‌ను సమీర్ విమానాశ్రయంలోనే ఆపేశారు. నాలుగు గంటల పాటు విచారించి 1.5 లక్షల రూపాయల పన్ను విధించి బయటకు పంపించారు. 


షారూక్‌ను మాత్రమే కాదు.. ఇతర సెలబ్రిటీలకు కూడా సమీర్ గతంలో చుక్కలు చూపించారు. విలువైన బంగారు నగలను కలిగి ఉందనే కారణంతో అనుష్క షెట్టిని గతంలో సమీర్ విమానాశ్రయంలో దాదాపు 11 గంటల పాటు నిలిపేసి విచారణ చేశారు. అలాగే దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, మనీషా లాంబా, రణ్‌బీర్ కపూర్, మికా సింగ్, బిపాసా బసు, వివేక్ ఒబెరాయ్, అనురాగ్ కశ్యప్, రియా చక్రవర్తిని కూడా గతంలో సమీర్ విచారించారు. 

Bollywoodమరిన్ని...