Abn logo
May 6 2020 @ 20:12PM

పీరియాడికల్ లవ్‌స్టోరీలో శ‌ర్వానంద్‌..?

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ హీరోగా రూపొందుతోన్న ‘శ్రీకారం’ సినిమా షూటింగ్ క‌రోనా ప్ర‌భావంతో ఆగిపోయింది. దీని తర్వాత శర్వానంద్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీలో న‌టించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల మేర‌కు 1910-2021 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ 2’ సినిమా తెర‌కెక్క‌నుంది. దీని త‌ర్వాత శ‌ర్వా, చందు కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని టాక్‌. 

Advertisement
Advertisement
Advertisement