Abn logo
Sep 21 2020 @ 17:28PM

ఓటీటీలో శర్వా... తప్పేట్టు లేదు

Kaakateeya

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న 29వ చిత్రం ‘శ్రీకారం’. ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్‌ ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్రలో అంటే పల్లెటూరి కుర్రాడిగా నటిస్తున్నారు. అది విడుదలైన ఫస్ట్ లుక్‌ చూస్తేనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా, పరిస్థితులన్నీ బాగుండి ఉంటే.. ఈ సరికే థియేటర్లలోకి వచ్చి ఉండేది. కానీ పరిస్థితులన్నీ తారుమారు అవడంతో.. ఈ చిత్ర విడుదలపై అనేకానేక వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా రాబోయే సంక్రాంతి బరిలో నిలిపేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సంక్రాంతి బరిలో దిగేందుకు ఇప్పటికే అరడజనుకు పైగా చిత్రాలు ఉండటంతో.. ఈ చిత్ర విడుదల ఓటీటీలో తప్పేట్టు లేదనేలా వార్తలు బయలుదేరాయి. ఇప్పటికే నాని 'వి' చిత్రం ఓటీటీలో విడుదలైంది. సూర్య, అనుష్క, రాజ్‌ తరుణ్ నటించిన చిత్రాలు త్వరలో ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్నాయి. మరికొన్ని చిత్రాలు కూడా ఓటీటీ వరుసలో ఉన్నాయి. ఇప్పుడు వారి బాటలోనే శర్వానంద్ 'శ్రీకారం' చిత్రం కూడా నడవనుందని తాజాగా సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి చిత్ర నిర్మాతలు 'శ్రీకారం' విడుదలపై ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
Advertisement