Jun 11 2021 @ 13:24PM

ఆ హీరో ప్లేస్‌లో శర్వానంద్..?

నితిన్, కృష్ణ చైత‌న్య కాంబినేష‌న్‌లో ప‌వ‌ర్‌పేట అనే చిత్రాన్ని రెండు బాగాలుగా రూపొందించనున్న‌ట్లు గ‌తంలో వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా స్టోరీ లైన్‌, మ‌రో సినిమా స్టోరీ లైన్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని భావించిన నితిన్ పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు హీరో శ‌ర్వానంద్‌ను ప‌వ‌ర్‌పేట‌లో న‌టింప చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో హీరో మూడు వేరియేష‌న్స్ ఉన్న లుక్స్‌లో క‌నిపిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆడాళ్లు మీకు జోహార్లు, మ‌హా స‌ముద్రం చిత్రాల్లో శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.