Abn logo
Apr 8 2021 @ 01:41AM

ఆటోవాలా ఇంట్లో షా భోజనం

కోల్‌కతా, ఏప్రిల్‌ 7: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో నాలుగో దశ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో టీఎంసీ, బీజేపీ శక్తి వంచన లేకుండా శ్రమిస్తు న్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం ఓ పేదోడి ఇంట్లో భోజ నం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగూర్‌ నుంచి  జరిగిన ఒక భారీ ర్యాలీలో అమిత్‌షా పాల్గొన్నారు. మధ్యాహ్నానానికి హౌరా జిల్లాలోని ధమ్‌జూర్‌ పట్టణానికి ర్యాలీ చేరుకొంది. వాహనం దిగి న అమిత్‌షా ఒక ఆటోవాలా ఇంట్లోకి వెళ్లారు. భోజనం పెట్టాలని కోరారు. ఆ కుటుంబ సభ్యులు కొద్ది క్షణాలపాటు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అన్నం, పప్పు, కాయగూరల కూరతో ఆ ఇంట్లోని మహిళ భోజనం వడ్డించగా.. కింద కూర్చొని అమిత్‌షా ఆరగించారు. తిన్నంతసేపూ ఎదురుగానే కూర్చున్న ఆ కుటుంబ సభ్యులు.. కొసరికొసరి వడ్డించారు. దంజూర్‌ నుంచి పోటీలో ఉన్న రాజీబ్‌ బెనర్జీ తదిరత బీజేపీ నేతలు కూడా అక్కడే  భోజనం చేశారు.

Advertisement
Advertisement