షావోమీ న్యూ కెమెరా సెన్సర్‌

ABN , First Publish Date - 2021-01-09T06:32:51+05:30 IST

షావోమీ ఉత్పత్తి ‘ఎంఐ 10ఐ 5జి’లో 108 మెగాపిక్సల్‌ మెయిన్‌ కెమెరా సెన్సర్‌ ఉండనున్నట్టు సమాచారం. రాబోయే ప్రొడక్ట్‌లో ఈ

షావోమీ న్యూ కెమెరా సెన్సర్‌

షావోమీ ఉత్పత్తి ‘ఎంఐ 10ఐ 5జి’లో 108 మెగాపిక్సల్‌ మెయిన్‌ కెమెరా సెన్సర్‌ ఉండనున్నట్టు సమాచారం. రాబోయే ప్రొడక్ట్‌లో ఈ ఫీచర్‌ ఉంటుందని షావోమీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.  ఎంఐ అలాగే 10ఐ లో ఉన్న ఐ - ఇండియాకు సూచిక. ఎంఐ సిరీస్‌లో ఇది ఆరో ఎంట్రీ. అయితే, ఇంతకుమునుపు బైటకు వచ్చిన వాటన్నింటినీ మన దేశంలో అమ్మకానికి పెట్టలేదు.


గీక్‌బెంచ్‌ అన్న వెబ్‌సైట్‌లో కూడా ఈ సరికొత్త ఫీచర్‌   మోడల్‌ నంబర్‌తో  ప్రస్తావనకు వచ్చింది. అమెజాన్‌ ఇండియా లిస్టింగ్స్‌లోనూ కనిపించిందట. స్నాప్‌డ్రాగాన్‌ 750జి ప్రాసెసర్‌ పవర్‌ అయి ఉంటుంది. 120హెచ్‌జెడ్‌, 6.67 ఇంచీల ఎఫ్‌హెచ్‌డి ప్లస్‌ ఎల్‌సిడి డిస్‌ప్లే, 16 మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, 4,820ఎంఎహెచ్‌ బ్యాటరీ, 33 వాట్స్‌ ఫాస్ట్‌ రీఛార్జింగ్‌  ఉంటాయని తెలిపింది. 

Updated Date - 2021-01-09T06:32:51+05:30 IST