Abn logo
Apr 27 2021 @ 11:35AM

షీక్యాబ్స్‌ మహిళా డ్రైవర్‌ పట్ల అసభ్య ప్రవర్తన

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : షీక్యాబ్స్‌ మహిళా డ్రైవర్‌ పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. లంగర్‌హౌజ్‌కు చెందిన రమణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఆదివారం గాజులరామారాంలో ఓ విందుకు వెళ్లి అక్కడ మద్యం తాగాడు. ఇంటికి వెళ్లేందుకు షీ క్యాబ్‌లో కారు బుక్‌ చేసుకున్నాడు. క్యాబ్‌లో ఎక్కిన దగ్గరి నుంచి మద్యం మత్తులో డ్రైవర్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు1లోకి వచ్చేసరికి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె డయల్‌ 100కు సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కారును బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లో ఆపి రమణను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement