స్నేహంగా పిలిచి ఏడాది క్రితం అత్యాచారం.. కేసు పెట్టిన యువతి.. వాంగ్మూలం ఇవ్వడానికి వస్తే వెంబడించి..

ABN , First Publish Date - 2021-08-30T14:46:19+05:30 IST

ఆమెకు ఏడాది క్రితం అతనితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఇద్దరూ మొబైల్‌లో బాగా చాట్ చేసుకునే వారు. ఇలా కొంత కాలం గడిచిన తర్వాత ఒక రోజు ఆమెను తన దగ్గరకు రావాలని అతను పిలిచాడు.

స్నేహంగా పిలిచి ఏడాది క్రితం అత్యాచారం.. కేసు పెట్టిన యువతి.. వాంగ్మూలం ఇవ్వడానికి వస్తే వెంబడించి..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు ఏడాది క్రితం అతనితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఇద్దరూ మొబైల్‌లో బాగా చాట్ చేసుకునే వారు. ఇలా కొంత కాలం గడిచిన తర్వాత ఒక రోజు ఆమెను తన దగ్గరకు రావాలని అతను పిలిచాడు. స్నేహంగా ఉన్నాడు కదా. ఏం పర్లేదు అనే ధైర్యంతో ఆమె అతను చెప్పిన హోటల్‌కు వెళ్లింది. ఆమెతో కాసేపు మామూలుగా మాట్లాడిన ఆ దుర్మార్గుడు.. ఆ తర్వాత తనలోని రాక్షసుడిని బయటపెట్టాడు. ఆమెను బలాత్కరించాడు. దీంతో ఖిన్నురాలైన ఆమె.. సదరు యువకుడిపై కేసు పెట్టింది. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇవ్వడం కోసం వచ్చిన ఆ యువతిపై నిందితుడు మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరమైన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది.


ఏడాది క్రితం తనపై రీగ్స్ ప్రాంతానికి చెందిన సురేష్ కుమార్ అనే యువకుడు అత్యాచారం చేసినట్లు ఒక యువతి(21) కేసు పెట్టింది. స్నేహంగా ఉన్న సురేష్ కుమార్.. ఆ తర్వాత తనను ఒక హోటల్‌కు పిలిచాడని, ఆపై అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసు హియరింగ్ సందర్భంగా సదరు యువతి జైపూర్ వచ్చింది. కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. ఆ సమయంలో స్నేహితులతో కలిసి సురేష్ కుమార్ ఆమెను వెంబడించాడు. సోదరుడి ఇంట్లో ఉంటున్న ఆమె ఇంటికి చేరుకునే వరకూ ఆగాడు. ఆమె సోదరుడు బయటకు వెళ్లగానే ఇంట్లో చొరబడిన సురేష్.. కోర్టులో వాంగ్మూలం మార్చుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో తీవ్రంగా కొట్టాడు. ఆపై ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి బాధితురాలి సోదరుడు ఇంటికి రావడంతో సురేష్ కుమార్ తన స్నేహితులతో కలిసి పరారయ్యాడు. ఈ విషయమై బాధితురాలు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై మరోసారి అత్యాచారం చేసిన సురేష్ కుమార్.. తన మెడలోని చైన్, రూ.54వేల నగదు కూడా దొంగిలించాడని ఆమె పోలసులకు తెలిపింది.

Updated Date - 2021-08-30T14:46:19+05:30 IST