కాల్‌గర్ల్ అంటూ ఫోటో, ఫోన్‌నెంబర్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్.. వరదలా కాల్స్.. భర్తనే అనుమానించింది కానీ.. చేసిందెవరో తెలిసి..

ABN , First Publish Date - 2021-08-02T02:54:59+05:30 IST

ఫేస్‌బుక్‌లో ఆమె పేరు, ఫొటో, ఫోన్ నెంబర్‌తో నకిలీ ఖాతా తెరిచారు. ఆపై ‘’కాల్ గర్ల్ కోసం కాల్ చేయండి’’ అంటూ కొన్ని ఫొటోలు పెట్టి, ఫోన్ నెంబర్ ఇచ్చారు.

కాల్‌గర్ల్ అంటూ ఫోటో, ఫోన్‌నెంబర్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్.. వరదలా కాల్స్.. భర్తనే అనుమానించింది కానీ.. చేసిందెవరో తెలిసి..

ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్‌లో ఆమె పేరు, ఫొటో, ఫోన్ నెంబర్‌తో నకిలీ ఖాతా తెరిచారు. ఆపై ‘’కాల్ గర్ల్ కోసం కాల్ చేయండి’’ అంటూ కొన్ని ఫొటోలు పెట్టి, ఫోన్ నెంబర్ ఇచ్చారు. దీంతో ఆ మహిళ ఫోన్‌కు వరుసపెట్టి కాల్స్ రావడం ప్రారంభమైంది. ఫోన్ చేసిన ప్రతి వ్యక్తీ తనతో అసభ్యంగా మాట్లాడటంతో ఆమెకు కంపరమెత్తింతి. ఇదంతా తనతో విడిపోయిన భర్తే చేశాడని అనుకున్న ఆమె.. వెంటనే పోలీసులను ఆశ్రయించి, భర్తపై ఫిర్యాదు చేసింది. అయితే అతన్ని అరెస్టు చేసిన పోలీసులకు దర్యాప్తులో ఎలాంటి అసాధారణ విషయమూ కనిపించలేదు.


ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయీ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. తన భర్తతో గొడవపడి విడిపోయింది. ఆమెకు ఇటీవల చాలామంది ఫోన్లు చేసి వేధిస్తున్నారు. తొలుత భర్తపై అనుమానం కలిగినా.. ఆ తర్వాతే అసలు నిజం బయటపడింది. ఇదంతా చేసింది ఆ భర్త స్నేహితుడు కిషోర్ అనే వ్యక్తి చేశాడు. ఒకసారి బాధితురాలి భర్త.. కిషోర్ ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ చేశాడట. అప్పుడే ఆమె నెంబర్ కిషోర్ చేతికి చిక్కింది. అప్పటి నుంచి ఆమెకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతూ.. ఆమెను ప్రేమిస్తున్నానని, అక్రమ సంబంధం పెట్టుకుందామని అడగటం మొదలుపెట్టాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పగ తీర్చుకోవాలని, ఆమె పేరుతో ‘కాల్ గర్ల్’ అంటూ ఫేక్ ఫేస్‌బుక్ ఐడీ సృష్టించాడు.

Updated Date - 2021-08-02T02:54:59+05:30 IST