Abn logo
May 23 2020 @ 03:08AM

సచివాలయ ఉద్యోగి ఖాతా నుంచి..రూ. 20 వేలు విత్‌డ్రా

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు


చింతపల్లి: సచివాలయ ఉద్యోగిని అక్కౌంట్‌ నుంచి రూ.20 వేలును ఓ అజ్ఞాత వ్యక్తి కాజేశాడు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం ఏఎస్పీ సతీశ్‌కుమార్‌కి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపాలెం సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాధవి ఏటీఎం కార్డు తన భర్త ఇమ్మానుయేలు వద్ద ఉంది. గురువారం ఓ అజ్ఞాత వ్యక్తి ఇమ్మానుయేల్‌కి ఫోన్‌ చేసి.. తాను బ్యాంక్‌ మేనేజర్‌నని, మీ ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిపోతుందని, మీ సెల్‌ నంబర్‌కి ఓటీపీ వస్తుందని.. అది చెబితే మీకు కొత్తకార్డు పంపిస్తామని చెప్పాడు. సైబర్‌ నేరాలపై అవగాహన లేని ఇమ్మానుయేలు వచ్చిన ఓటీపీని అజ్ఞాత వ్యక్తికి చెప్పాడు. దీంతో అతని భార్య మాధవి ఖాత నుంచి రూ.20 వేల డ్రా చేసినట్టు మెసేజ్‌ వచ్చింది. ఈవిషయమై బ్యాంక్‌ మేనేజర్‌కి సంప్రదించగా.. మోసపోయామని గుర్తించి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ఈసందర్భంగా ఏఎస్పీ సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లో ఎదుటువారికి చెప్పరాదన్నారు. 

Advertisement
Advertisement
Advertisement