షీర్‌ కుర్మా

షీర్‌కుర్మాలో...

క్యాలరీలు - 208

ప్రోటీన్‌ - 4.2గ్రా

ఫ్యాట్‌ - 5.85గ్రా

కార్బోహైడ్రేట్లు - 36.65గ్రా


కావలసినవి: షీర్‌ సేమ్యా - పావుకేజీ, నెయ్యి - 50 ఎం.ఎల్‌, పాలు - ఒక లీటరు, జీడిపప్పు - 50గ్రా, యాలకులు - రెండు, పంచదార - 150గ్రా, ఖర్జూరం - 100గ్రా, ఎండుద్రాక్ష - 50గ్రా, పిస్తా - 50గ్రా, కోవా - 20గ్రా, సారపప్పు - 50గ్రా.


తయారీ విధానం: ముందుగా సేమ్యాను వేగించి పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నెయ్యి వేయాలి. నూనె వేడి అయ్యాక డ్రై ఫ్రూట్స్‌ వేసి వేగించాలి. తరువాత పాలు, పంచదార వేసి కలపాలి. ఇప్పుడు కోవా వేసి మరగనివ్వాలి. చివరగా సేమ్యా వేసి మరో రెండు నిమిషాలపాటు ఉడికించి దింపాలి. బౌల్‌లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

క్వినోవా ఖీర్‌లడ్డూలునువ్వుల బర్ఫీ డ్రైఫ్రూట్స్‌ కజ్జికాయలురస్‌ మలాయిఖర్బూజ బర్ఫీఖీర్‌డ్రైఫ్రూట్స్‌ లడ్డూగాజర్‌ హల్వాకాజూ బర్ఫీ
Advertisement
Advertisement