Advertisement
Advertisement
Abn logo
Advertisement

టాప్‌లోనే షఫాలీ

  • మహిళల టీ20 ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: భారత మహిళల క్రికెట్‌లో టీనేజ్‌ సెన్సేషన్‌ షఫాలీ వర్మ ఐసీసీ టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఆమె 776 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక స్కాట్లాండ్‌ క్రికెట్‌ (పురుషుల, మహిళల) నుంచి టాప్‌-10లో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా కేథరిన్‌ బ్రైస్‌ రికార్డు సృష్టించింది. స్మృతి మంధాన నాలుగు, జెమీమా తొమ్మిదో స్థానంలో ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి దీప్తీ శర్మ, రాధా యాదవ్‌ వరుసగా 6,7వ స్థానాల్లో ఉన్నారు.

Advertisement
Advertisement