అమ్మకు ఆశ్రయం

ABN , First Publish Date - 2020-08-09T09:22:53+05:30 IST

మళ్లీ వస్తామని చెప్పి కన్న కొడుకులు ఓ వృద్ధురాలిని బస్టాండ్‌లో వదిలివెళ్లారు. ఆ తల్లి వారం రోజులుగా బస్టాండ్‌లోనే ఉంటోంది. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ బస్టాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది...

అమ్మకు ఆశ్రయం

  • వృద్ధురాలిని బస్టాండ్‌లో వదిలివెళ్లిన కొడుకులు 
  • వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించిన అధికారులు

కీసర రూరల్‌: మళ్లీ వస్తామని చెప్పి కన్న కొడుకులు ఓ వృద్ధురాలిని బస్టాండ్‌లో వదిలివెళ్లారు.  ఆ తల్లి వారం రోజులుగా బస్టాండ్‌లోనే ఉంటోంది. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడ బస్టాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో అలమటిస్తున్న వృద్ధురాలికి స్థా నికులు ఆహారం అందించారు. ఆమె దీనస్థితిని ఓవ్యక్తి వీడియో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టుచేసాడు. ఇది కలెక్టర్‌ వరకూ చేరడంతో ఆశ్రమంలో చేర్పించారు. దీంతో తహసీల్దార్‌ నాగరాజు, వీఆర్‌ఓ సోహైల్‌ వెళ్లి ఆమె వివరాలు తెలుసుకున్నారు. తన పేరు లతాబాయని, తన ఇద్దరు కుమారులు ఇక్కడే ఉండమని, మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారని వాపోయింది.  దీంతో శనివారం ఆ వృద్ధురాలికి మాధురి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించారు.  


Updated Date - 2020-08-09T09:22:53+05:30 IST