శిఖామణి సాహితీ పురస్కారం బాలూ స్మృతి సంచిక రొట్టమాకురేవు కవిత్వ అవార్డు

ABN , First Publish Date - 2020-10-12T06:20:42+05:30 IST

సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి గాను ప్రతీ యేటా ఇచ్చే ‘శిఖామణి సాహితీ పురస్కారం’ 2020కి శీలావీర్రాజు ఎంపిక అయ్యారు. అవార్డు కింద రూ.10వేల నగదు, జ్ఞాపిక, శాలువతో సత్కారం ఉంటుంది...

శిఖామణి సాహితీ పురస్కారం  బాలూ స్మృతి సంచిక రొట్టమాకురేవు కవిత్వ అవార్డు

శిఖామణి సాహితీ పురస్కారం

సాహిత్యంలో జీవన సాఫల్య కృషికి గాను ప్రతీ యేటా ఇచ్చే ‘శిఖామణి సాహితీ పురస్కారం’  2020కి శీలావీర్రాజు ఎంపిక  అయ్యారు. అవార్డు కింద రూ.10వేల నగదు, జ్ఞాపిక, శాలువతో సత్కారం ఉంటుంది. ఈ ప్రధాన పురస్కారంతో పాటు కవి సంధ్య ప్రతిభా పురస్కారాలకు ఎస్వీ రాఘవేంద్ర రావు, జ్యోతి చంద్ర మౌళి, దిలావర్‌, పెనుగొండ లక్ష్మీ నారాయణ, సంగెవేని రవీంద్ర, మేడిశెట్టి తిరుమల కుమార్‌, విజయ చంద్ర, చల్లపల్లి స్వరూపరాణి ఎంపిక అయ్యారు. అవార్డు ప్రదాన సభ అక్టోబరు 30 సా.5గంటలకు జూమ్‌ వేదికపై జరుగుతుంది.

దాట్ల దేవదానం రాజు


బాలూ స్మృతి సంచిక

యస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతిచిహ్నంగా ‘సంస్కృతి’ సంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ, గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరం లో అక్టోబరు 18 ఉ. 11 గం.లకు ‘బాలూ.... పాటవై వచ్చావు భువనానికి’ అనే సంచికను ఆవిష్కరిస్తారు. ఇందులో బాలుపై పత్రికలలో వచ్చిన వ్యాసాలను; మిత్రులు, సహచరులు, అభిమానులు ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను; బాలూ ప్రసార మాధ్యమాలలో యిచ్చిన ఇంట ర్వ్యూలను పొందుపరిచారు. సర్రాజు బాలచం దర్‌, వాసిరెడ్డి విద్యాసాగర్‌, మోదుగుల రవి కృష్ణ, పిన్నమనేని మృత్యుంజయరావు పాల్గొంటారు.

మోదుగుల రవికృష్ణ 


రొట్టమాకురేవు కవిత్వ అవార్డు

‘రొట్టమాకురేవు కవిత్వ అవార్డు’లో భాగంగా 2020 సంవత్సరానికి అవార్డులను ఈ కింది కవితా సంపుటాలకు ప్రదానం చేయడం జరుగుతుంది. షేక్‌ మహమ్మద్‌ మియా స్మారక కవిత్వ అవార్డు: ‘రేగుపండ్ల చెట్టు’ (కోడూరి విజయకుమార్‌); కె.యల్‌. నరసిం హారావు స్మారక కవిత్వ అవార్డు: ‘స్పెల్లింగ్‌ మిస్టేక్‌’ (అనిల్‌ డాని), ‘మనిషొక పద్యం’ (మెట్టా నాగేశ్వరరావు); పురిటిపాటి రామి రెడ్డి స్మారక కవిత్వ అవార్డు: ‘కాలం వాలిపో తున్నవైపు’ (మెర్సీ మార్గరెట్‌). వివరాలకు: 9849156588

శిలాలోలిత, కవి యాకూబ్‌


శివేగారి దేవమ్మ స్మారక పురస్కారం

శివేగారి దేవమ్మ స్మారక పురస్కారం కోసం 2020లో ముద్రితమైన కథలు, కవితల సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. మూడేసి ప్రతులను డిసెంబర్‌ 31లోగా చిరునామా: శివేగారి, కాలవపల్లి, ఎం.పీ. కొటూరు (పోస్ట్‌), పలమనేరు (మండలం), చిత్తూరు జిల్లా, పిన్‌: 517408, ఫోన్‌: 6300318230కు పంపాలి. బహుమతి పొందిన కథల, కవితల సంపుటాలకు రూ.7వేలతో సభలో పురస్కార ప్రదానం జరుగుతుంది.

శివేగారి

Updated Date - 2020-10-12T06:20:42+05:30 IST