Shikhar Dhawan: అజిత్ వాడేకర్ రికార్డు బద్దలుగొట్టిన గబ్బర్

ABN , First Publish Date - 2021-07-19T21:41:11+05:30 IST

భారత యువజట్టుకు సారథ్యం వహిస్తున్న శిఖర్ ధవన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే కెప్టెన్‌గా

Shikhar Dhawan: అజిత్ వాడేకర్ రికార్డు బద్దలుగొట్టిన గబ్బర్

కొలంబో: భారత యువజట్టుకు సారథ్యం వహిస్తున్న శిఖర్ ధవన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన అజిత్ వాడేకర్ రికార్డును బద్దలుగొట్టాడు. భారత వన్డే జట్టు తొలి కెప్టెన్ అజిత్ వాడేకర్ 1974లో ఇంగ్లండ్‌తో హెడింగ్లీలో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులు చేశాడు.


నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 86 పరుగులు చేసిన ధవన్ ఈ రికార్డును బద్దలుగొట్టాడు. కాగా, భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ 1996లో కెప్టెన్‌గా శ్రీలంకతో కొలంబోలో జరిగిన మ్యాచ్‌తో 110 పరుగులు చేశాడు. భారత జట్టులో ఇప్పటికీ ఇదే అత్యధికం. 


అలాగే, ధవన్ ఖాతాలో మరో రికార్డు కూడా నమోదైంది. అత్యంత వేగంగా 6 వేల పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాడిగాను, శ్రీలంకపై అతి తక్కువ ఇన్నింగ్స్ (17)‌లలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గానూ రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీం ఆమ్లా గతంలో 18 ఇన్నింగ్స్‌లలోనే వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడా రికార్డును ధవన్ బ్రేక్ చేశాడు. 

Updated Date - 2021-07-19T21:41:11+05:30 IST