Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముగ్గురు Tollywood హీరోలను మోసం చేసిన శిల్ప అరెస్ట్..

హైదరాబాద్ : అధిక వడ్డీ ఇస్తానని చెప్పి కోట్లు వసూలు చేసి మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పను పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సియర్ల దగ్గర్నుంచి ఈమె డబ్బులు తీసుకొని మోసం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంతేకాదు.. ముగ్గురు టాలీవుడ్ హీరోలను సైతం ఆమె మోసం చేసింది. ప్రముఖుల పేర్లు చెప్పి శిల్ప ఇలా డబ్బులను తీసుకుంటోంది. ఫేజ్ త్రీ పార్టీలు ఇచ్చి మరీ సెలబ్రిటీలను శిల్ప ఆకర్షించింది. 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకూ శిల్ప కుచ్చు టోపీ పెట్టింది.


తాము మోసపోయామని అంటూ పోలీస్ స్టేషన్‌లకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రముఖుల్ని శిల్ప మోసం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శిల్ప బారిన పడిన వారిలో ముఖ్యంగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, లాయర్లు, ఫైనాన్షియర్లు ఉన్నారు. శిల్పతో పాటు ఆమె భర్తను సైతం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.


Advertisement
Advertisement