Jul 24 2021 @ 20:03PM

Shilpa shetty: ఆయన అమాయకుడు!

పోర్న్‌ వీడియోల నిర్మాణం కేసులో అరెస్ట్‌ అయిన తన భర్త రాజ్‌కుంద్రా ఏమీ తెలియని అమాయకుడని, ఆయన కేవలం వెబ్‌ సిరీస్‌లె మాత్రమే నిర్మించాడని బాలీవుడ్‌ హీరోయిన్‌ శెల్పాశెట్టి వ్యాఖ్యానించారు.  ‘పోర్న్‌ రాకెట్‌’ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం సాయంత్రం ముంబై పోలీసులు ఆమెను ఆరుగంటల పాటు విచారించారు. రాజ్‌కుంద్రా వ్యాపారాలతో శిల్పాశెట్టికి ఏమన్నా సంబంధం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అశ్లీల చిత్రాల నిర్మాణంలో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో భాగమైన హాట్‌షాట్స్‌ యాప్‌ లండన్‌కు చెందినదని, దాని వ్యవహారాలు రాజ్‌ బావ ప్రదీప్‌ భక్షి చూసుకుంటున్నారని.. దానిపై తనకు ఎలాంటి అవగాహనా లేదని శిల్పాశెట్టి పోలీసులకు తెలిపినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


కథానాయిక గెహనా వశిష్ఠ్‌ రాజ్‌కంద్రాకు మద్దతుగా నిలిచారు. కుంద్రా నిర్మాణ సంస్థలో వచ్చిన మూడు సినిమాల్లో నటించిన గహనా వశిష్ఠ్‌ తాజాగా  ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. అశ్లీల చిత్రాల కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో నన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దానికి కొన్ని రోజుల ముందు నేను కుంద్రా ఆఫీస్‌కు వెళ్లాను. ‘బాలీఫేమ్‌’ పేరుతో కొత్త యాప్‌ని ప్రారంభించాలనే ఆలోచనలో రాజ్‌ ఉన్నట్లు తెలిసింది.  నాన్‌ బోల్డ్‌ కంటెంట్‌తో ఈ యాప్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి లీడ్‌ రోల్‌లో ఓ కథ ఓకే అయింది’’ అని గెహనా వశిష్ఠ్‌ తెలిపారు.