May 7 2021 @ 23:08PM

శిల్పాశెట్టికి నెగెటివ్‌... కుటుంబానికి పాజిటివ్‌

హిందీ కథానాయిక శిల్పా శెట్టి కుంద్రా మినహా ఆమె కుటుంబ సభ్యులు అందరూ కరోనా బారిన పడ్డారు. కుటుంబంలోని కరోనా పేషెంట్లు అందరూ ఐసోలేషన్‌లో ఉన్నారని శిల్పాశెట్టి తెలిపారు. ‘‘గత పది రోజులు మా కుటుంబానికి భారంగా, కష్టంగా గడిచాయి. మా అత్తమామలకు కొవిడ్‌19 పాజిటివ్‌ అని తేలింది. ఆ తర్వాత మా అమ్మాయి సమిష, అబ్బాయి వియాన్‌ రాజ్‌, ఆఖరున మా ఆయన రాజ్‌ కరోనా బారిన పడ్డారు.


అధికారిక నిబంధనల ప్రకారం... మా ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఎవరికి వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. మా ఇంట్లోని సిబ్బందిలో ఇద్దరు సైతం కరోనా బారిన పడ్డారు. వాళ్లకు చికిత్స అందిస్తున్నాం. దేవుడి దయ వల్ల అందరూ కోలుకుంటున్నారు. నా కొవిడ్‌19 ఫలితాలు వచ్చాయి. నెగెటివ్‌ అని తేలింది. మేం జాగ్రత్తలన్నీ పాటిస్తున్నాం’’ అని శిల్పాశెట్టి కుంద్రా పేర్కొన్నారు.