May 17 2021 @ 11:14AM

మ‌హేశ్28లో శిల్పా శెట్టి పాత్ర అదేనా..?

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో సినిమాలు చేసిన బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి, దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత మ‌హేశ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో శిల్పాశెట్టి పాత్ర‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వివ‌రాల మేర‌కు మ‌హేశ్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించ‌నున్న సినిమాలో మ‌హేశ్ అత్త‌య్య పాత్ర‌లో శిల్పా శెట్టి క‌నిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామాల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన త్రివిక‌మ్ర్ అత్తారింటికి దారేది చిత్రంలో న‌దియా, అజ్ఞాత‌వాసిలో ఖుష్బూ, అల వైకుంఠ‌పుర‌ములో ట‌బుల‌ను కీల‌క పాత్ర‌ల్లో చూపించారు. ఇప్పుడు అదే త‌ర‌హాలో శిల్పా శెట్టి రోల్‌ను కూడా త్రివిక్ర‌మ్ ఎలివేట్ చేయ‌నున్నార‌ట‌. మ‌రి ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజుల ఆగ‌క త‌ప్ప‌దు.