Aug 2 2021 @ 04:56AM

థియేటర్లలో మెరిసే మెరిసే

‘హుషారు’ ఫేమ్‌ దినేష్‌ తేజ్‌, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో వెంకటేష్‌ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘మెరిసే మెరిసే’ చిత్రం ట్రైలర్‌ను హీరో విశ్వక్‌సేన్‌ విడుదల చేశారు. ‘‘ఎన్ని ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నా, థియేటర్‌లో సినిమా చూసిన అనుభూతి వేరు, ‘మెరిసే మెరిసే’ను థియేటర్లలో చూడండి’’ అని విశ్వక్‌సేన్‌ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమ, భావోద్వేగాల కలబోతగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కోరారు.