Abn logo
Jan 6 2021 @ 12:04PM

28 ఏళ్ల కుర్రాడికి రూ. 39 కోట్ల లాటరీ... పండగే పండగ!

కోచ్చి: కేరళకు చెందిన యువకుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో 20 మిలియన్ల దిర్హమ్‌లు(సుమారు రూ. 39 కోట్లు) లాటరీలో గెలుచుకున్నాడు. మస్కట్‌లో ఒక షాపింగ్ సెంటర్ నిర్వహించే అబ్దుస్సలామ్ ఎన్వీ(28) ఈ ఏడాది తొలి రఫల్ డ్రా  గెలుచుకున్నాడు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబ్దుస్సలామ్ బిగ్ టిక్కెట్ అబుధాబీ డ్రా గెలుచుకున్నాడు. అయితే అతనికి ఈ విషయం ఒకరోజు తరువాత తెలిసింది. రఫల్ నిర్వాహకులు అబ్దుస్సలామ్‌ను కలుసుకునేందుకు అతని గ్రూపు సభ్యులను సంప్రదించారు.

ఈ నేపధ్యంలోనే స్నేహితుని ద్వారా అబ్దుస్సలామ్ తాను లాటరీ గెలుచుకున్న సంగతి తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మెత్తాన్నితాను తన స్నేహితులతో పాటు పంచుకుంటానని తెలిపాడు. కాగా యూఏఈలో గత ఏడాది మేలో ఒక భారతీయుడు లక్కీ డ్రాలో 10 మిలియన్ల దిర్హమ్‌లు అంటే రూ. 20 కోట్లు గెలుచుకున్నాడు. ఆ వ్యక్తి కూడా కేరళకు చెందినవాడే కావడం విశేషం. అతని పేరు దిలీప్ కుమార్. అతను ఏప్రిల్ 14న ఆన్‌లైన్ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. దిలీప్ ఈ డ్రాను రఫెల్ ద్వారానే గెలుచుకున్నాడు.

Advertisement
Advertisement