మెరిసే గుహ!

ABN , First Publish Date - 2021-05-27T05:30:00+05:30 IST

అవి నక్షత్రాలు కావు. కానీ మిలమిల మెరిసిపోతూ వెలుగులు జిమ్ముతుంటాయి. ఆ గుహలోకి వెళితే ఓ కొత్త లోకంలోకి వెళ్లిన భావన కలుగుతుంది. గ్లో వార్మ్స్‌ వల్ల కలిగే

మెరిసే గుహ!

అవి నక్షత్రాలు కావు. కానీ మిలమిల మెరిసిపోతూ వెలుగులు జిమ్ముతుంటాయి. ఆ గుహలోకి వెళితే ఓ కొత్త లోకంలోకి వెళ్లిన భావన కలుగుతుంది. గ్లో వార్మ్స్‌ వల్ల కలిగే అద్భుతం అది. న్యూజీలాండ్‌లోని వైటొమో అనే గ్రామంలో కనిపించే వింత ఇది. ఆ విశేషాలు ఇవి..


ఆకాశంలో నక్షత్రాల్లా మెరిసే వాటిని గ్లో వార్మ్స్‌ అంటారు. ఇవి మన దగ్గర కనిపించే మిణుగురు పురుగుల్లాంటివి. అయితే ఇవి అంతటా కనిపించవు. ఇవి వైటొమో అనే గ్రామంలో ఉన్న భూగర్భ గుహల్లో మాత్రమే కనిపిస్తాయి.

అవి గుహ లోపల ఉపరితలానికి అంటిపెట్టుకుని ఉంటాయి. కొన్ని వేల గ్లో వార్మ్స్‌ అలా ఉపరితలానికి అంటి పెట్టుకుని వెలుగులు జిమ్ముతుంటాయి. వాటిని చూస్తుంటే కొత్తలోకంలోకి వచ్చామన్న భావన కలుగుతుంది. ఈ గుహను సందర్శించడానికి పర్యాటకులు విశేషంగా తరలివస్తుంటారు.  

ఈ గ్లో వార్మ్స్‌ చిన్న చిన్న కీటకాలను, పురుగులను తిని జీవిస్తాయి. వీటిని చూడటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో అక్కడి ప్రభుత్వం వాటి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Updated Date - 2021-05-27T05:30:00+05:30 IST