Advertisement
Advertisement
Abn logo
Advertisement

గొర్రె సమయస్ఫూర్తి!

ఒకరోజు గొర్రె అడవిలో గడ్డి మేస్తూ తోటి గొర్రెల నుంచి దూరంగా వెళ్లిపోయింది. అ గొర్రె ఒంటరిగా ఉండటాన్ని ఒక నక్క చూసింది. మెల్లగా ఆ గొర్రెను సమీపించింది. నక్క దగ్గరికి వచ్చే వరకు గొర్రె గమనించలేదు. ఒక్కసారిగా నక్కను చూడగానే గొర్రె భయపడిపోయింది. ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని అనుకుని నక్కను వేడుకోవడం మొదలుపెట్టింది. ‘‘నన్ను తినకు. నా పొట్ట నిండా గడ్డి ఉంది. కాసేపు ఆగితే గడ్డి జీర్ణమవుతుంది. అప్పుడు నా మాంసం మరింత రుచికరంగా ఉంటుంది. నువ్వు నన్ను డ్యాన్స్‌ చేయనిస్తే గడ్డి త్వరగా అరుగుతుంది. తరువాత నన్ను తినొచ్చు’’ అంది గొర్రె. అందుకు నక్క ఒప్పుకొంది. దాంతో గొర్రె డ్యాన్స్‌ చేయడం  మొదలుపెట్టింది. డ్యాన్స్‌ చేస్తున్న సమయంలోనే దానికి ఒక ఆలోచన తట్టింది. ‘‘నా మెడలో ఉన్న గంటను తీసి గట్టిగా మోగిస్తే నేను ఇంకా బాగా డ్యాన్స్‌ చేస్తాను’’ అని అంది గొర్రె. అప్పుడు నక్క గొర్రె మెడలో ఉన్న గంటను తీసి గట్టిగా మోగించింది. ఆ శబ్దం విన్న గొర్రె యజమాని పరుగున వచ్చి నక్కను తరిమేశాడు. అలా గొర్రె నక్క బారి నుంచి తప్పించుకుంది. 

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...