Abn logo
Nov 28 2020 @ 00:02AM

షిర్డీ ప్రయాణికులకు శుభవార్త

1న పట్టాలెక్కనున్న నాగర్‌సోల్‌ ప్రత్యేక రైలు

నరసాపురం, నవంబరు 27 : షిర్డీ వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త. డిసెంబరు ఒకటో తేదీ నుంచి నరసాపురం – నాగర్‌సోల్‌ మధ్య ప్రత్యేక రైలుగా పట్టాలెక్కనుంది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి 23 నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. దాదాపు ఏడు నెలల తరువాత మళ్లీ ఈ రైలుకు పచ్చజెండా ఊపుతూ దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ రైలు వారంలో ఐదు రోజులు వరంగల్‌ మీదుగా, శుక్ర, ఆదివారాలు గుంటూరు మీదుగా నాగర్‌సోల్‌ వెళుతుంది. నరసాపురంలో ఉదయం 11.05 గంటలకు ఈ రైలు బయలుదేరి వరంగల్‌ మీదుగా వెళ్లే రోజుల్లో నాగర్‌సోల్‌కు ఉదయం 6.30 గంటలకు చేరుతుంది. గుంటూరు మీదుగా వెళ్లే రోజుల్లో ఉదయం 9.30 గంటలకు వెళుతుంది. తిరిగి అక్కడ మఽధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నరసాపురం వస్తుంది. 

Advertisement
Advertisement
Advertisement