Abn logo
Oct 7 2021 @ 08:21AM

Shirdi:సాయిబాబా దేవాలయం నేటి నుంచి పునర్ ప్రారంభం..భక్తులకు కొత్త గైడ్‌లైన్స్

షిర్డీ (మహారాష్ట్ర): మహారాష్ట్ర షిర్డీలోని ప్రపంచ ప్రఖ్యాత సాయిబాబా ఆలయం గురువారం భక్తుల కోసం తిరిగి తెరిచారు.కరోనా విపత్తు అనంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ జారీ చేసిన కొవిడ్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్ పాస్‌లు ఉన్న15,000 మంది భక్తులను ఆలయంలోకి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని గురువారం నుంచి తెరచి నందున జిల్లా పాలనా యంత్రాంగం, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహణ సమావేశం నిర్వహించింది.భక్తులు ఆన్‌లైన్ పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ట్రస్ట్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆలయంలో ప్రసాద కౌంటరును మూసివేశారు.10 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, మాస్కులు లేని వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. షిర్డీ ఆలయంలో ఉదయం దర్శనానికి రూ.600, మధ్యన్, ధూప్ హారతి దర్శనానికి రూ.400 చెల్లించి పాస్ పొందాలని ఆలయ అధికారులు చెప్పారు. సాయిబాబా ఆలయంలో ఉదయం హారతి తెల్లవారుజామున 4.30 గంటలకు, మధ్య హారతి మధ్యాహ్నం 12గంటలకు ఉంటుందని అధికారులు వివరించారు.

ఇవి కూడా చదవండిImage Caption