Abn logo
Sep 19 2021 @ 09:43AM

Vishakapatnam: జడ్పీ చైర్‌పర్సన్‌గా శివరత్నం?

అధికార వైసీపీ ఖరారు

జీకే వీధి జడ్పీటీసీగా పోటీ 


విశాఖపట్నం/ పాడేరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యధిక జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమాగా చెబుతున్న వైసీపీ నాయకులు, కాబోయే జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పేరుని వెల్లడించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుండగా... ఒకరోజు ముందే ప్రకటించడం గమనార్హం. ఎస్టీ మహిళకు రిజర్వు చేసిన ఈ పదవిని జీకేవీధితోపాటు వి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల నుంచి పోటీ చేస్తున్న వారు కూడా ఆశిస్తున్నారు. అనూహ్యంగా జీకేవీధి జడ్పీటీసీగా పోటీ చేసిన కిముడు శివరత్నం పేరుని ప్రకటించారు. వైసీపీ సీనియర్‌ నేత మత్స్యరాస విశ్వేశ్వరరాజు భార్య అయిన ఆమె స్వస్థం పాడేరు మండలం తామరాపల్లి.  బీఏ, బీఈడీ చదువుకున్నారు. జి.మాడుగుల మండలం కిల్లంకోటకు చెందిన విశ్వేశ్వరరాజు వివాహం చేసుకున్నారు. గత ఎన్నికలలో పాడేరు నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని విశ్వేశ్వరరాజు ఆశించారు. అయితే పలు కారణాల వల్ల భాగ్యలక్ష్మికి అవకాశం ఇచ్చారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఎస్టీలకు కేటాయిస్తే అవకాశం ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందట! ఈ నేపథ్యంలో జడ్పీ పీఠం ఎస్టీ మహిళలకు రిజర్వు చేయడంతో విశ్వేశ్వరరాజు తన భార్యను జీకేవీధి నుంచి పోటీ చేయించారు.