Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శివారెడ్డి

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 4: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎ్‌సఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె. శివారెడ్డి నియమితులయ్యారు. కర్నూలులో  నిర్వహించిన ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర 48వ మహా సభల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పెద్దమండ్యం మండలం దిగువపల్లెకు చెందిన శివారెడ్డి, తిరుపతి ఎస్వీ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదివే రోజుల నుంచే ఏఐఎ్‌సఎఫ్‌ పట్ల ఆకర్షితులై సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీలో బీఎస్సీ (ఎంపీసీఎస్‌) చదువుతూ విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ ఏఐఎ్‌సఎఫ్‌ కమిటీ కార్యదర్శిగా పని చేశారు. ఎస్వీయూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ చదువుతూ జిల్లా విద్యార్థి ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎదిగారు. ప్రస్తుతం విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న శివారెడ్డి ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. శివారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల ఏఐఎ్‌సఎఫ్‌ మాజీ, ప్రస్తుత నాయకులతో పాటు సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement