వివాదాస్పదంగా శ్మశాన వాటిక స్థలం

ABN , First Publish Date - 2021-02-22T05:30:00+05:30 IST

ఇల్లెందు పట్టణంలోని 2వవార్డు ఇల్లెందులపాడు సమీపంలో గల హిందుశ్మశాన వాటిక స్థలం వివాదస్పదంగా మారింది.

వివాదాస్పదంగా శ్మశాన వాటిక స్థలం
శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌, మునిసిపల్‌ చైర్మన్‌

సాగని నిర్మాణాలు

కౌన్సిలర్ల మధ్య విభేదాలతో మారిన స్థలం

ఇల్లెందుటౌన్‌, ఫిబ్రవరి 22: ఇల్లెందు పట్టణంలోని 2వవార్డు ఇల్లెందులపాడు సమీపంలో గల హిందుశ్మశాన వాటిక స్థలం వివాదస్పదంగా మారింది. ఇటివల శ్మశాన వాటిక అభివృద్ధికోసం వైకుంఠదామం నిర్మాణం చేసేందుకు మునిసిపల్‌ అధికారులు దిగగా శ్మశాన వాటిక స్థలం తమదంటు 1వ వార్డు సత్యనారాయణపురానికి చెందిన సుమారు10 మందిరైతులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో శ్మశానవాటిక స్థలం వివాదస్పదంగా మారడంతో పాటు రెండు వార్డులకు ప్రాతినిధ్యం వహించే ఇద్దరు అధికారపార్టీ కౌన్సిలర్ల నడుమసైతం విభేదాలు పోడచూపాయి. ఇల్లెందులపాడు చెరువు అలుగుబాగంలో బ్రిటీ్‌షకాలంనుంచి సర్వేనెంబర్‌ 528లో  శ్మశాన వాటిక ఉంది. ఎంతోకాలంగా శ్మశానవాటిక ఉండగా మునిసిపాలిటి ద్వారా ఇటివల శ్మశాన వాటికను అధునాతనంగా మార్చేందుకు వైకుంఠదామం ఏర్పాటు కోసం రూ.30లక్షలు  కేటాయించారు. అయితే నిర్మాణాలు చేసేందుకు అధికారులు దిగగా శ్మశాన వాటిక స్థలం తమదంటు సత్యనారాయణపురం గ్రామానికి చెందిన 10మంది రైతులు తమవద్ద ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నాయని, రైతుబందుసైతం పొందుతున్నామని పేర్కొంటు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అంతేకాకుండా శ్మశాన వాటిక స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటు అడ్డుకున్నారు. అయితే శ్మశాన వాటికస్థలాన్ని ఆక్రమించడమే గాక అక్రమంగా పట్టాలు సైతం చేయించుకున్నారని సర్వేనెంబర్‌ 528 అంతా చెరువు శిఖంతోపాటు ఆలుగు ప్రాంతంలోను ఉంటుందని ప్రభుత్వ భూమి అయినప్పడు ఇతరులకు అభ్యంతరాలు ఏమిటనీ ఇల్లెందులపాడు వాసులు ప్రశ్నిస్తున్నారు. రైతుల తరుపున 1వార్డు కౌన్సిలర్‌, శ్మశానవాటికను అభివృద్ధిచేయాలంటు 2వవార్డు కౌన్సిలర్‌లు కోరడంతో ఇద్దరినడుమ తీవ్రస్ధాయిలో విబేదాలు వచ్చాయి. ఇద్దరు అధికార పార్టీ కౌన్సిలర్లు చేరోవైపు ఉండటంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది. రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులకు సమస్య పరిష్కారం ఎలా చేయాలనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం శ్మశానవాటికస్ధలాన్ని తహసీల్దార్‌ కృష్ణవేణి, మునిసిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటివెంకటేశ్వరరావులతోపాటు రెవెన్యూ అధికారులు పరిశీలించారు. స్థలం పరిశీలన సందర్బంలో కూడా రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోపాటు తమస్ధలాన్ని తమకు ఉండే విధంగా చూడాలని అధికారులను కోరడం విశేషం. 


Updated Date - 2021-02-22T05:30:00+05:30 IST