Abn logo
Aug 11 2020 @ 03:43AM

ద్రవిడ్‌ను అవుట్‌ చేయకుంటే ‘శుక్రవారం’ సంబరాలు లేనట్టే!

న్యూఢిల్లీ: రాహుల్‌ ద్రవిడ్‌ క్రీజులో ఉంటే.. శుక్రవారంనాటి రాత్రి సంబరాలకు దూరమవుతామని, అందువల్ల అతడిని త్వరగా ఎలా అవుట్‌ చేయాలా అని తాను, అఫ్రీది ఆలోచించినట్టు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ వెల్లడించాడు. 1999లో బెంగళూరులో జరిగిన పెప్సీకప్‌ వన్డే ఫైనల్లో జరిగిన ఉదంతాన్ని అక్తర్‌ వివరించాడు. ‘ఆ మ్యాచ్‌లో సచిన్‌ ఆడలేదు. నేను శడగోపన్‌ రమేశ్‌ను అవుట్‌ చేశా. భారత్‌ 3-4 వికెట్లను త్వరగా కోల్పోయింది. ద్రవిడ్‌ క్రీజులో ఉన్నాడు. అతడు క్రీజులో పాతుకుపోతే ఇబ్బందులే. మనకు శుక్రవారం రాత్రి సంబరాలుండవు. అందుకే ఎలాగైనా అతడిని అవుట్‌ చేయమని అఫ్రీది చెప్పాడు. దాంతో నేను ఓ బంతిని నేరుగా ద్రవిడ్‌ ప్యాడ్లపైకి వేసి అవుటివ్వాలని అంపైర్‌ను కోరా. అంతేకాదు.. ఈరోజు శుక్రవారమని, మేము సంబరాలు చేసుకోవాలని కూడా అంపైర్‌కు చెప్పా. కానీ, అతడు అవుట్‌ ఇవ్వలేదు. అయినా చివరకు ఆ మ్యాచ్‌లో మేమే గెలిచాం’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement
Advertisement