కరోనాపై పోరుకు ఇండో-పాక్‌ సిరీస్‌

ABN , First Publish Date - 2020-04-09T10:07:02+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాటం కోసం నిధులు సేకరించడానికి చిరకాల ప్రత్యర్థులైన ఇండో-పాక్‌ మధ్య వన్డే సిరీస్‌ నిర్వహించాలని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌

కరోనాపై పోరుకు ఇండో-పాక్‌ సిరీస్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటం కోసం నిధులు సేకరించడానికి చిరకాల ప్రత్యర్థులైన ఇండో-పాక్‌ మధ్య వన్డే సిరీస్‌ నిర్వహించాలని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రతిపాదించాడు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా 2007 నుంచి భారత్‌, పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీ్‌సలు జరగలేదు. ‘ఈ విపత్కర పరిస్థితుల్లో నిధుల సేకరణ కోసం దాయాది దేశాల మధ్య మూడు మ్యాచ్‌లు నిర్వహించాలని కోరుతున్నా. ఈ సిరీస్‌ ఫలితం గురించి ఇరు దేశాల అభిమానులు నిరాశపడరని భావిస్తున్నాన’ని అక్తర్‌ చెప్పాడు. ఈ సిరీస్‌ ద్వారా సేకరించిన మొత్తాన్ని వైర్‌సపై పోరాడేందుకు ఇరు దేశాలకు సమానంగా విరాళం ఇవ్వాలన్నాడు. ‘విరాట్‌ సెంచరీ కొడితే మేం ఆనందపడతాం. బాబర్‌ ఆజమ్‌ శతకం బాదితే భారత ఫ్యాన్స్‌ కూడా ఎంజాయ్‌ చేస్తారు’ అని షోయబ్‌ అన్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌లు జరిగితే ప్రేక్షకుల స్పందన భారీగా ఉంటుందని చెప్పాడు. షాహిద్‌ అఫ్రీది స్వచ్ఛంద సంస్థకు సహాయం చేయాల్సిందిగా యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ విజ్ఞప్తి చేయడాన్ని కొందరు విమర్శించారు. అలాంటి విమర్శలు చేయడం అమానవీయమని అక్తర్‌ అన్నాడు.

Updated Date - 2020-04-09T10:07:02+05:30 IST