కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన అమ్మాయి.. ఆమెను పరీక్షించి వైద్యులు షాక్.. తల్లిదండ్రులకు మ్యాటర్ ముందే తెలుసా..!

ABN , First Publish Date - 2021-11-04T23:04:07+05:30 IST

స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆ చిన్నారికి ప్రస్తుతం 14ఏళ్లు. నిన్నమొన్నటి వరకూ బాగానే స్కూల్‌కు వెళ్లింది. పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో గురువారం ఇంటి వద్దే ఉంది. అంతేకాకుండా దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు పనుల్లో బిజీగా ఉండటం

కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన అమ్మాయి.. ఆమెను పరీక్షించి వైద్యులు షాక్.. తల్లిదండ్రులకు మ్యాటర్ ముందే తెలుసా..!

ఇంటర్నెట్ డెస్క్: స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆ చిన్నారికి ప్రస్తుతం 14ఏళ్లు. నిన్నమొన్నటి వరకూ బాగానే స్కూల్‌కు వెళ్లింది. పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో గురువారం ఇంటి వద్దే ఉంది. అంతేకాకుండా దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు పనుల్లో బిజీగా ఉండటంతో ఆమె కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంది. అయితే అప్పటి వరకూ చలాకీగా బాగానే ఉన్న ఆ చిన్నారికి అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో బంధువులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమెను పరీక్షించిన వైద్యులు షాకయ్యారు. కాగా.. ఇంతకీ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. 



రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన 14ఏళ్ల బాలిక దగ్గరలోని పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. దీపావళి సందర్భంగా స్కూల్‌కు సెలవు ఉండటంతో ఇంటి పనుల్లో కుటంబ సభ్యులకు సహాయం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ చిన్నారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో సన్నిహితులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ అమ్మాయిని పరీక్షించిన వైద్యులు.. షాకయ్యారు. 14ఏళ్ల బాలిక.. నెలలు నిండిన గర్భవతి అని తెలిసి కంగుతిన్నారు.


పురుటి నొప్పులతో ఆమె బాధపడుతుండటంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు.. ఆ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ అంశంపై బాలిక బంధువులు సహా, తల్లిదండ్రులను నిలదీశారు. అయితే వారి వద్ద నుంచి సమాధానం లేకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. 14ఏళ్ల కూతురు గర్భవతి అని కుటుంబ సభ్యులకు ముందే తెలుసా అని ఆశ్యర్యపోయారు. కాగా.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 




Updated Date - 2021-11-04T23:04:07+05:30 IST