Shocking : ఈతకు రాలేదు.. పొదుగు లేదు.. అయినా పితక్కుండానే పాలధార...!

ABN , First Publish Date - 2021-08-10T18:39:31+05:30 IST

ఈతకు రాలేదు.. పొదుగులేదు.. అయినా పితక్కుండానే ఆవు నుంచి పాలధార...

Shocking : ఈతకు రాలేదు.. పొదుగు లేదు.. అయినా పితక్కుండానే పాలధార...!

చిత్తూరు జిల్లా/వడమాలపేట : ఈతకు రాలేదు.. పొదుగులేదు.. అయినా పితక్కుండానే ఆవు నుంచి పాలధార వస్తోంది. వడమాలపేట మండలంలోని నెన్నూరు వెంకటరెడ్డి కండ్రిగ గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. వెంకటరమణారెడ్డికి చెందిన రెండున్నర సంవత్సరాల వయసున్న ఆవు  పొదుగు నుంచి పాలు కారుతోంది. ఆదివారం సాయంత్రం ఒక పర్యాయం ఒకటిన్నర లీటరు పాలు ధారగా వచ్చింది. నాలుగు రోజులుగా రోజు మార్చి రోజు ఒకసారి పితికితే తరువాత దానంతట అదే పాలు కారుతోంది. హార్మోను సమస్యల కారణంగా పదివేల ఆవుల్లో ఒకదానికి ఇలా జరుగుతుందని, సుమారు పది పర్యాయాల తరువాత పాలు కారడం ఆగిపోతుందని పశువైద్యాధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-08-10T18:39:31+05:30 IST