Abn logo
May 2 2021 @ 17:17PM

ఇద్దరినీ కలిపింది విజయ్ మాల్యానే.. సీరం సీఈవో అదర్‌ పూనావాలా భార్య గురించి షాకింగ్ నిజాలు..!

ఆదార్ పూనావాలా.. ప్రస్తుతం భారత్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గూగుల్ నిండా ఆయన వల్లే వారి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ భారీ డీల్స్ చేసుకొని బాగా ఆర్జించింది. ఎంతలా అంటే ఇటీవల వారానికి రూ.50 లక్షలపైగా అద్దె కడుతూ లండన్‌లో ఆదార్.. ఓ విలా్లా రెంట్ తీసుకున్నారు. ఇంతలా సంపాదించిన ఆదార్ భార్య నటాషా కూడా పేరున్న వ్యాపార వేత్తే అవడం విశేషం. నటాషా పూనావాలా కూడా చిన్నాచితకా బిజినెస్‌వుమెన్ కాదు. సొంత కాళ్లపై నిలబడి బిజినెస్ సర్కిల్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మరి ఈ బిజినెస్ జంట తొలిసారి ఎలా కలిశారు? వీళ్లిద్దరినీ ఎవరు కలిపారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా?


మాజీ బిజినెస్ టైకూన్, ప్రస్తుతం పరారీలో ఉన్న విజయ్ మాల్యా.. పూనావాలా దంపతులను కలిపాడట. అప్పట్లో యువ వ్యాపారవేత్తలైన ఆదార్, నటాషా.. గోవాలో మాల్యా ఇచ్చిన న్యూ ఇయర్ పార్టీకి హాజరయ్యారు. అక్కడే అతన్ని ఆమె తొలిసారి కలిసింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆపై అది ప్రేమగా మారి బిజినెస్ ప్రపంచంలోని ఒక సక్సెస్‌ఫుల్ జంట ఏర్పడిందన్నమాట. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని సీరస్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించినప్పటి నుంచి ఈ కంపెనీ గురించి, ఆదార్ పూనావాలా గురించి, ఆయన భార్య గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. వీరి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అలాంటి నటాషా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే..


1. పూనావాలా ఇండస్ట్రీస్‌లో నటాషా కొన్ని కీలక పదవులు పోషిస్తున్నారు. విలూ పూనావాలా ఫౌండేషన్ చైర్‌పర్సన్ అయిన ఆమె.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతేగాక నెదర్లాండ్‌లోని పూనావాలా సైన్స్ పార్క్, విలూ పూనావాలా రేసింగ్ అండ్ బ్రీడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.


2. ఈమె బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలున్న ఫ్యాషనిస్తా, సోషలైట్, ఫిలాంత్రఫిస్ట్ కూడా.


3. నటాషా పూనావాలా (నీ అరోరా) 1981 నవంబరు 26న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ప్రమేష్ అరోరా, మిన్నీ అరోరా. పూణేలోనే పెరిగిన ఆమె సెయింట్ మీరు స్కూల్‌లో ప్రాథమిక విద్యనభ్యసించిన ఆమె.. పూణే యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీపొందారు.


4. అమెరికాలోని కార్నెల్, స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీల్లో పలు సమ్మర్ ప్రోగ్రాములకు నటాషా హాజరయ్యారు. ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇన్ ఆర్గనైజేషన్ బిహేవియర్ నుంచి 2004లో డిగ్రీ పూర్తిచేసింది.


5. ఆదార్, నటాషాలు కలవడానికి మాజీ బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా కారణం. అతనిచ్చిన ఒక న్యూ ఇయర్ పార్టీలో ఆదార్, నటాషా తొలిసారి కలిశారు.


6. 2006లో ఆదార్‌ను వివాహమాడారు. వీరికి సైరస్, డారియస్ అనే ఇద్దరు కుమారులు.


7. మెలిందా గేట్స్, దివంగత తన అత్తగారు తనకు స్ఫూర్తి అని చెప్పుకునే నటాషా.. తనకు తాను దాతగా అభివర్ణించుకుంటారు. అత్తగారు చనిపోయినప్పుడు ఆమె పేరిట ఒక ఫౌండేషన్ స్థాపించి సమాజ సేవ చేయడం ప్రారంభించినట్లు ఆమె వివరించారు.


8. చెత్తను రీసైకిల్ ఎనర్జీగా మార్చడం, శుద్ధమైన తాగునీరు అందించడం, పూణేను మోడల్ సిటీగా మార్చడం కోసం చర్చలు, అలాగే పూణేలో ఉన్న స్వచ్ఛంద ఆస్పత్రి ఈ కుటుంబానికి చెందిన కొన్ని ప్రాజెక్టులు. ఈ కుటుంబానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థలకు నటాషానే చైర్ పర్సన్.


9. నటాషాను సోషల్ సర్కిల్స్‌లో ‘క్వీన్ ఆఫ్ డెర్బీ’ అని పిలుస్తారు. ఎందుకంటే నటాషా దంపతులు జీవన శైలి చాలా విపరీతంగా ఉంటుంది. గుర్రపు స్వారీలు, ప్రైవేటు జెట్‌లు, లగ్జరీ ఫాస్ట్ కార్లు తదితరాల వాడకం ఎక్కువ. అంతేకాదు, నటాషా ఎప్పుడూ కూడా ఆంటోనియో బెరార్డి, బిర్కిన్స్, చానెల్, స్టెల్లా మెక్‌కార్ట్నీ వంటి లగ్జరీ బ్రాండ్ దుస్తులే ధరిస్తారు.


10. పూణేలో ఆమె అధికారిక ఇల్లు ఉన్నప్పటికీ.. నటాషా ఎక్కువగా ముంబైలోని ఆమె బంగ్లాలోనే ఎక్కువగా గడుపుతారు. ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్, గౌరీ ఖాన్ తదితర బాలీవుడ్‌కు చెందిన తన మిత్రులకు ఇక్కడ ఆమె ఎక్కువగా పార్టీలు ఇస్తుంటారు. Advertisement
Advertisement