Abn logo
Sep 18 2021 @ 23:09PM

షూటింగ్‌ బాల్‌ క్రీడా జిల్లా జట్ల ఎంపిక

షూటింగ్‌ బాల్‌ క్రీడా పోటీలకు ఎంపికైన మహిళలు, పురుషుల క్రీడా కారుల జట్లు

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు18: బుచ్చిరెడ్డిపాళెంలోని డీఎల్‌ఎన్‌ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శనివారం సీనియర్‌ మహిళలు, పురుషుల షూటింగ్‌బాల్‌ క్రీడా జట్ల ఎంపికలు జరిగాయి.  జిల్లా నలుమూలల నుంచి 60 మంది పురుషులు, 40మంది మహిళలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రెండు జిల్లా జట్లకు ఎంపిక చేశారు.  ఎంపికైన పురుష, మహిళా జట్లకు 10రోజులపాటు కోచింగ్‌ క్యాంపు నిర్వహిస్తారని జిల్లా షూటింగ్‌బాల్‌ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు విజయవాడలో జరగబోవు రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో షూటింగ్‌బాల్‌ జిల్లా అధ్యక్షుడు మోర్ల భరత్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి బీ. వెంకటరమణయ్య, తిరుపతయ్య, పద్మనాభం. ప్రభాకర్‌రెడ్డి, మునికుమార్‌, మస్తానమ్మ, రాజా, సీనియర్‌ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.