ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతుండ‌గా.. శ్వేతసౌధం సమీపంలో కాల్పులు

ABN , First Publish Date - 2020-08-12T13:34:04+05:30 IST

అత్యంత భద్రత నడుమ ఉండే శ్వేతసౌధం సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. కాల్పుల గురించి తెలుసుకుని, ట్రంప్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారు.

ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతుండ‌గా.. శ్వేతసౌధం సమీపంలో కాల్పులు

వాషింగ్టన్‌, ఆగస్టు 11: అత్యంత భద్రత నడుమ ఉండే శ్వేతసౌధం సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. కాల్పుల గురించి తెలుసుకుని,  ట్రంప్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారు. పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 5.53 గంటలకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనపడడంతో అతడిపై సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది కాల్పులు జరపడ ంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దుండగుడి వద్ద ఆయుధం ఉందని, నిషేధిత ప్రదేశంలోకి దానితో రావడంతోనే కాల్పులు జరిపామని అధికారులు తెలిపారు. కాగా, మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయిన ట్రంప్‌  కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ వచ్చి కరోనా వ్యాప్తి గురించి మాట్లాడారు. కాల్పుల ఘటన గురించి కూడా వివరించారు.  కాల్పులు జరిపిన దుండగుడిని ఆస్పత్రికి తరలించారని ఆయన చెప్పారు.  

Updated Date - 2020-08-12T13:34:04+05:30 IST