Abn logo
Aug 1 2021 @ 23:11PM

అక్కవరంలో షూటింగ్‌ సందడి

హీరో సుమన్‌పై ఓ సన్నివేశం చిత్రీకరణ

టెక్కలి రూరల్‌, ఆగస్టు 1: టెక్కలి మండలం అక్కవరంలో ఆదివారం సినిమా షూటింగ్‌ జరిగింది. దివ్య తేజస్విని ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘పల్లె గూటికి పండగొచ్చింది’ సినిమా చివరి దశ షూటింగ్‌ పంట పొలాల్లో చేశారు. ఈ సందర్భంగా హీరో సుమన్‌, హీరోయిన్‌ అంషితలపై ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారు. టెక్కలి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరు కున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈనెల చివరి వారంలో సినిమా విడుదల కాను న్నట్లు సమాచారం. డైరెక్టర్‌ కె.తిరుమలరావు, కో-డైరెక్టర్‌ మోహన్‌, జామి శ్రీను, కెమెరామెన్‌ రవి, కోరాడ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.