మధ్యాహ్నానికే దుకాణాల మూత

ABN , First Publish Date - 2020-05-21T10:46:55+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ అమలులో ఆమోమయ పరిస్థితి కొనసాగుతోంది. 4.0 ్ఞఅమల్లోకి వచ్చి మూడు

మధ్యాహ్నానికే దుకాణాల మూత

జన సంచారం, వాహనాలు మాములే

లాక్‌డౌన్‌ అమలులో కొనసాగుతున్న అయోమయం


ఒంగోలు, మే 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో లాక్‌డౌన్‌ అమలులో ఆమోమయ పరిస్థితి కొనసాగుతోంది. 4.0 ్ఞఅమల్లోకి వచ్చి మూడు రోజులు గడిచినా జిల్లాలో సడ లింపులు ఏమిటి? ఆంక్షలు ఎక్కడ? అన్నది ప్రజలకు అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో గతంలో మాదిరి నియంత్రణ లేక, అలాగని సడలింపులు అమలు కాక జనం అయోమయానికి గురవుతున్నారు. జిల్లా వ్యా ప్తంగా బుధవారం కూడా అలాంటి పరిస్థితే కనిపిం చింది. నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లలోనూ మధ్యాహ్నం ఒం టి గంటకే దుకాణాలను అధికారులు మూసివేయిం చారు.


అదే సమయంలో కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఉన్న రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్లలో గతంలో మాదిరి నియంత్రణ చర్యలు కనిపించడం లేదు. యథేచ్ఛగా అన్ని వేళ ల్లోనూ జన సంచార, వాహనాల రాకపోకలు సాగుతు న్నాయి.   గురువారం నుంచి ఆర్టీసీ బస్సులు కూడా రోడ్లపైకి రానున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలుపై నిర్థిష్ట విధానం అవలంబించకపోతే పరిస్థితి మరింత గందరగోళంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. 

Updated Date - 2020-05-21T10:46:55+05:30 IST