Abn logo
Oct 25 2021 @ 00:37AM

షెడ్డు కూలి వృద్ధుడి మృతి

కాకినాడ క్రైం, అక్టోబరు 24 : శిథిలమైన షాపు స్లాబ్‌ షెడ్డు కూలి ఓ వృద్ధుడు మృతి చెందాడు. జగన్నాథపురం చినమార్కెట్‌ వీధికి చెందిన ఓసుపల్లి భీమేశ్వరరావు (70) ఆదివారం హోండా యాక్టివా బైక్‌పై పని మీద పెదమార్కెట్‌కు వస్తున్నాడు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోకి వస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ కాల్‌ రావడంతో సెల్‌ఫోన్లో మాట్లాడేందుకు బైక్‌ను రోడ్డు పక్కకు పార్కింగ్‌ చేసి అక్కడే ఉన్న వెంకట్రావుచౌదరికి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ కింద నిలబడి సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్నాడు. ఫోన్‌లో మాట్లాడే సమయంలో అకస్మాత్తుగా షాపు స్లాబ్‌ షెడ్‌ కూలిపోయి భీమేశ్వరరావుపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ రామ్మోహన్‌రెడ్డి  సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.  పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.