కొనుగోలు కేంద్రాలు ప్రారంభంతోనే సరి

ABN , First Publish Date - 2021-11-15T05:40:21+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నా యి. గత నెల మూడో వారం నుంచి ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం రాశులు పోసి రైతులు పడిగాపులుకాస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభంతోనే సరి

మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు

జాప్యంపై పోరుబాటపట్టిన రాజకీయ పార్టీలు

నేడు ఉమ్మడి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటన


నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నా యి. గత నెల మూడో వారం నుంచి ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం రాశులు పోసి రైతులు పడిగాపులుకాస్తున్నారు. ఆకాశంలో మబ్బులు, చిరుజల్లులతో ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం కలుగుతుండగా, ఎప్పుడు వర్షం వస్తుందో, ధాన్యం తడుస్తుందో అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. కనీసం టార్పాలిన్లు కూడా ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో రైతులపై అద్దెభారం పడుతోంది. 


నల్లగొండ పరిధిలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రం లో పెద్ద సంఖ్యలో రైతులు ధాన్యం రాశులు కుప్పలుగా పోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు టోకెన్లు ఇచ్చి సీరియల్‌ ప్రకా రం కొనుగోలు చేస్తున్నా జాప్యం చోటుచేసుకుంటోంది. తేమ 17శాతం ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతుండగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. వానాకాలం సీజన్‌లో నల్లగొండ జిల్లాలో 5లక్ష ల మెట్రిక్‌ టన్నులు, సూర్యాపేటలో 4లక్షలు, యాదాద్రి జిల్లాలో 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించాల్సి ఉంది. 


కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా..

నల్లగొండ జిల్లాలో మొత్తం 220 ధాన్యాం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, సూర్యాపేట జిల్లాలో 223, యాదాద్రి జిల్లాలో 261 కేంద్రాలకు 145 ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగొళ్లు వేగవంతమవుతున్నాయి. నల్లగొండ, యాదాద్రి జిల్లా లో మాత్రం కొనుగోళ్లలో జాప్యం చోటుచేసుకుంటోంది. ఉమ్మడి జిల్లా లో మొత్తం 13.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగ ా, ఇప్పటి వరకు కనీసం లక్ష మెట్రిక్‌ టన్నులు కూడా సేకరించలేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం ఎగుమతి చేయడంలో కూడా ఆలస్యమవుతోంది. లారీలు సరిపడా రాకపోవడంతో కొనుగోలు కేంద్రా ల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు వారాల క్రితం ప్రారంభించిన కేంద్రాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, యాసంగిలో వరి సాగుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గరిడేపల్లి మండలం కేంద్రంలో విపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో కొనసాగింది. చివ్వెంల మండల కేంద్రంలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేయడంతో అన్నదాతలు ఆగ్రహించి రోడ్డెక్కారు. పెన్‌పహాడ్‌ మండలంలో పలు ప్రాంతాల్లో ఈ నెల 10న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా, నేటికీ ఒక్క బస్తా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షం వస్తే నష్టపోతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో మిల్లర్లు తిరకాసు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సన్న రకాలకు మిల్లర్లు ధర తగ్గించి ప్రభుత్వ మద్దతు ధర రూ.1965ను ఎగ్గొడుతున్నారు. తేమ 17శాతం ఉన్నా కొనుగోలులో జాప్యం చేస్తూ ధర తగ్గిస్తున్నారని,మిల్లర్లు సిండికేట్‌గా మారారని రైతులు ఆరోపిస్తున్నారు.


బీజేపీ పోరుబాట

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పలు పార్టీలు ఆందోళన బాటపట్టాయి. బీజేపీ ఇప్పటికే కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించింది. రైతుల పక్షాన పోరును ఉధృ తం చేసే ందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉమ్మడి జిల్లాలో ఈ నెల 15, 16 తేదీ ల్లో పర్యటించనున్నారు. 15వ తేదీన ఉదయం నల్లగొండ మండల పరిధిలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్‌ సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఆ తరువాత మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులతో ముచ్చటిస్తారు. సూర్యాపేటలో రాత్రి బస చేసి 16వ తేదీన తిరుమలగిరి, తుంగతుర్తి ప్రాంతాల్లో పర్యటించి జనగామ జిల్లాకు వెళ్తారు.


అండగా వామపక్షాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయరంగంపై చిన్నచూపు చూస్తూ రైతులను ఇబ్బందులను గురిచేస్తున్నాయని ఇప్పటికే వామపక్షాలు ధర్నాలు నిర్వహించాయి. ఇటీవల కలెక్టరేట్లను సైతం ముట్టడించారు. నిత్యం కొనుగోలు కేంద్రాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూ లకంటి రంగారెడ్డి, ఉమ్మడి జిల్లా కార్యదర్శులు పర్యటించి రైతుల ఇ బ్బందులపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మాడ్గులపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మోకాళ్లపై కూర్చోని ఆందోళన నిర్వహించారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశా రు. నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.


 ఇప్పటికే పర్యటించిన కాంగ్రెస్‌ బృందం

కాంగ్రెస్‌ పార్టీ సైతం ఇప్పటికే ఐకేపీ కేంద్రాలను సందర్శించింది. పార్టీ రాష్ట్ర నేతలు చిన్నారెడ్డి, సంభాని చం ద్రశేఖర్‌తోపాటు మల్‌రెడ్డి రంగారెడ్డి, తదితరులు ఇటీవల ఉమ్మడి జిల్లాలో పర్యటించి రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, ధాన్యం కొనుగోలు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.


టీడీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో..

తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఆం దోళనలు నిర్వహిస్తోంది. ధాన్యం కొనుగోలు నిర్లక్ష్యంపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఇప్పటికే టీడీపీ నల్లగొం డ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నెలూ ్లరి దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆందోళన లు కొనసాగాయి. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర స్థాయి సదస్సును నల్లగొండలో నిర్వహించాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈ సదస్సు కు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ ముఖ్య నాయకులను రప్పించి ప్రభు త్వం ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. అందుకు రాష్ట్ర నాయకత్వంతో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి శేఖర్‌రెడ్డి ఇటీవల చర్చించారు. ఈ సదస్సుకు ముం దే ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగో లు కేంద్రాలను సందర్శించి పోరాట ాలు నిర్వహించాలని నిర్ణయించారు.


రెండు నెలలుగా ఇబ్బందులు : శ్రీనివాస్‌, రైతు, నల్లగొండ

ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు నెలలు గా ఇదే సమస్య. ఇటీవల ఐకేపీ కేంద్రానికి ధా న్యాన్ని తీసుకురాగా, ఆదివారం సీరియల్‌ ప్రకారం టోకెన్‌ ఇచ్చారు. ఓ వైపు మబ్బులు, చిరు జల్లులు భయపెడుతున్నాయి. ధాన్యం తడిస్తే ఎవ్వరూ కొనుగోలు చేయరు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాలి.


Updated Date - 2021-11-15T05:40:21+05:30 IST