యూట్యూబ్‌లో షాపింగ్‌

ABN , First Publish Date - 2021-01-16T05:40:32+05:30 IST

వినోదం పంచుకోవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఉపయోగపడిన యూట్యూబ్‌ ఇకపై షాపింగ్‌ సాధనంగానూ మారింది. గూగుల్‌ తన వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన యూట్యూబ్‌ నుంచి షాపింగ్‌ చేసేలా రూపొందిస్తోంది...

యూట్యూబ్‌లో షాపింగ్‌

వినోదం పంచుకోవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఉపయోగపడిన యూట్యూబ్‌ ఇకపై షాపింగ్‌ సాధనంగానూ మారింది. గూగుల్‌ తన వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన యూట్యూబ్‌ నుంచి షాపింగ్‌ చేసేలా రూపొందిస్తోంది.   యూట్యూబ్‌లో ఉంచే వీడియో సహకారంతో షాపింగ్‌ చేయవచ్చు. ఈ పైలట్‌ స్కీమ్‌లో  పాలుపంచుకుంటున్న తయారీదారులు తమ వీడియోలకు కొన్ని ఉత్పత్తులను జతచేస్తారు. ఈ వీడియోల్లోనే షాపింగ్‌ బ్యాగ్‌ ఐకాన్‌ దిగువన ఎడమవైపు ఉంటుంది. దానిపై వీక్షకులు క్లిక్‌ చేస్తే చాలు, ఫీచర్డ్‌ ప్రొడక్టుల జాబితా కనిపిస్తుంది. అక్కడ నుంచి ప్రతి ప్రొడక్ట్‌, దాని ఫీచర్స్‌, కొనుగోలు ఆప్షన్‌ కనిపిస్తాయి. అమెరికాలో ఐఔస్‌, ఆండ్రాయిడ్‌, డెస్క్‌టాప్‌పై ప్రస్తుతం ఇది అందుబాటులోకి వచ్చింది. హ్యాష్‌టాగ్‌తో కొత్త పేజీని పరిచయం చేస్తున్నట్టు మొదట ప్రకటించింది. వినియోగదారుడు ఇంతకు మునుపు హ్యాష్‌టాగ్‌ కోసం సెర్చ్‌ లేదంటే క్లిక్‌ చేసినప్పుడు సంబంధిత సమాచారానికి తోడు వేర్వేరు కంటెంట్‌ కూడా కనిపించేది. అందుకుబదులు ఇప్పుడు యూట్యూబ్‌ ఎంపిక చేసిన లేదంటే నేరుగా ఉపయోగపడే వీడియోలనే అగ్రభాగాన ఉంచుతుంది. మొదట ఇందుకోసం పేజ్‌ని పరిచయం చేసిన యూట్యూబ్‌ రెండోదిగా వీడియో ప్రత్యక్షమయ్యే ఏర్పాటు చేసింది. మూడోదిగా వెబ్‌సైట్‌కు వాయిస్‌ కమాండ్‌ సపోర్ట్‌ చేస్తోంది. సెర్చ్‌ బాక్స్‌ పక్కన మైక్రోఫోన్‌ ఐకాన్‌ను ఉంచుతోంది. దాంతో అటువైపు నుంచి వచ్చిన ఫలితాన్ని తెలియజేస్తోంది. షోమీ మై సబ్‌స్ర్కిప్షన్స్‌, షో మీ మై లైబ్రరీ వంటి కమాండ్స్‌తో మరింతగా తెలుసుకునే వీలు కూడా ఉంటుంది. మొత్తమ్మీద అన్‌లైన్‌ షాపింగ్‌ కొత్త పుంతలు తొక్కనుంది. 


Updated Date - 2021-01-16T05:40:32+05:30 IST