షాపింగ్‌ సందడి

ABN , First Publish Date - 2021-10-12T07:21:33+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌తో రెండేళ్ల తర్వాత ఈ యేడు మార్కెట్‌లో దసరా సందడి కనిపిస్తోంది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడడంతో ఇప్పుడిప్పుడే అన్ని రకాల వ్యా పారాలు ఊపందుకుంటున్నాయి. బతుకమ్మ, దసరా పండుగల సమయం దగ్గర పడడంతో మార్కెట్‌లో మరింత రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా వస్త్ర, కిరణా, జ్వువెల్లరి, లేడిస్‌ ఎంపోరియం, మొబైల్‌ షాప్‌, దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

షాపింగ్‌ సందడి

జిల్లాలో మొదలైన దసరా కలెక్షన్‌,  రద్దీగా మారిన మార్కెట్లు 

ఊపందుకుంటున్న వ్యాపారాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌లు

బహుమతులతో ఆకట్టుకుంటున్న షాపింగ్‌ మాల్స్‌

బంగారం, బట్టల కొనుగోళ్లతో మహిళలు బిజీబిజి

ఆదిలాబాద్‌, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి): కరోనా ఎఫెక్ట్‌తో  రెండేళ్ల తర్వాత ఈ యేడు మార్కెట్‌లో దసరా సందడి కనిపిస్తోంది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడడంతో ఇప్పుడిప్పుడే అన్ని రకాల వ్యా పారాలు ఊపందుకుంటున్నాయి. బతుకమ్మ, దసరా పండుగల సమయం దగ్గర పడడంతో మార్కెట్‌లో మరింత రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా వస్త్ర, కిరణా, జ్వువెల్లరి, లేడిస్‌ ఎంపోరియం, మొబైల్‌ షాప్‌, దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. తొలి పంటలుగా చెప్పుకునే పెసర, మినుము, పత్తి,  సోయా పంటలు చేతికి రావడంతో గ్రామీణ ప్రాంతా ల నుంచి రైతులు మార్కెట్‌కు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే దసరా సెలవులు కూడా మొదలు కావడంతో మహిళలు, విద్యార్థులు కుటుంబ సమేతంగా షాపింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాపారులు దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని భారీ మొత్తంలో సరుకులను నిల్వ చేసుకుంటున్నారు. ప్రజల ఆసక్తి అవసరాలను బట్టి ప్రత్యేకంగా పండుగ ఆఫర్‌లను ఇస్తూ సేల్స్‌ పెంచుకొనేలా ఏర్పా ట్లు చేస్తున్నారు. అయితే కొనుగోలు దారుల రద్దీతో ఎక్కడా కొవిడ్‌ నిబంధనలపై పట్టింపే కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలోని వినాయకచౌక్‌, గాంధీచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌, శివాజీచౌక్‌ ట్రాఫిక్‌తో కిక్కిరిసిపో తోంది. రోడ్లపైనే వాహనాలు నిలిపి ఉంచడంతో తర చూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్న పోలీసులు తేలికగానే తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.  

ఫ ప్రజల్లో పండుగ సెంటిమెంట్‌..

ధనిక, పేద అనే తేడాలేకుండా ప్రజల్లో దసరా పండుగ  సెంటిమెంట్‌ కనిపిస్తోంది. ఆర్థిక స్తోమతను బట్టి పండుగకు కొత్త దుస్తులను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. షాపింగ్‌ చేసే ముందు ఆన్‌ లైన్‌ షాపింగ్‌ ధరలను పరిశీలిస్తున్నారు. ఆకర్షనీయమైన వస్తువులను తక్కువ ధరల్లోనే కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమకు ఇష్టమైన మ నస్సుకు నచ్చిన వ స్తువుల కోసం యు వత ఎక్కవగా ఆన్‌లై న్‌ షాపింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. సెల్‌ ఫోన్స్‌, రెడిమేడ్‌ డ్రైస్‌మెటీరియల్‌, ఎలక్ర్టానిక్‌ వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారానే కొనేందు కు ఇష్టపడుతున్నారు. గతానికంటే భిన్నంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. అమేజాన్‌, ఫ్లిప్‌కార్డు, మింత్ర, అజీవో ఆన్‌లైన్‌ కంపెనీల ద్వారా భారీగా కొనుగోలు జరుగుతున్నాయి. అసలే దసరా సీజన్‌ కావడంతో ఆన్‌లైన్‌ కంపెనీలకు మరింత గిరాకీ పెరుగుతోంది.

ఫ డిస్కాంట్‌, ఆఫర్‌..

ప్రస్తుతం ఏ వ్యాపార షాపింగ్‌ ముందు చూసిన  డిస్కాంట్‌, ఆఫర్‌ ఫ్లెక్సిలే దర్శనమిస్తున్నాయి. వ్యాపార ప్రకటనలతో వ్యాపారస్తులు మార్కెట్‌లో సందడి చేస్తున్నారు.  కొన్నాళ్ల నుంచి దసరా ఆఫర్‌ల కోసం ఎదురు చూస్తున్న వారంతా ప్రస్తుతం షాపింగ్‌తో బిజీబిజిగా మారిపోతున్నారు. ముఖ్యంగా షాపింగ్‌మాల్స్‌, రెడిమెంట్‌, హోల్‌ సెల్‌దుకాణం దారులు కొనుగోలు దారులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ఆఫర్‌ చేస్తున్నారు. నూతన డిజైన్‌ల పేరిట మార్కెట్‌లో భారీ కలెక్టన్‌ చేస్తున్నారు. 10 నుంచి 20 శాతం వరకు భారీగా డిస్క్‌ంట్‌లను ప్రకటిస్తున్నారు. ప్రధానంగా వస్త్ర దుకాణాలు, హోల్‌సెల్‌, బంగారునగల దుకాణాలు వినియోగదారులతో రద్దీగా కనిపిస్తున్నాయి. వ్యాపారులు పోటా పోటీగా కొనుగోలుదారులు ఆకర్షిస్తూ అమ్మకాలను పెంచుకొనేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి గతంతో పోల్చుకుంటే ఈయేడు వ్యాపారం కొంత మెరుగ్గానే కనిపిస్తుందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-10-12T07:21:33+05:30 IST