కొండపైనే దుకాణాలు నిర్మించి ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-18T06:02:48+05:30 IST

వర్తక సంఘానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు కొండపైనే దుకాణాలు నిర్మించి ఇవ్వాలని వర్తక సఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. సీఎం తమకు ఇచ్చిన తొలి హామీ ని నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం

కొండపైనే దుకాణాలు నిర్మించి ఇవ్వాలి
రిలే నిరాహారదీక్షలు నిర్వహిస్తున్న వర్తక సంఘం సభ్యులు

యాదాద్రి టౌన్‌, జనవరి17: వర్తక సంఘానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు కొండపైనే దుకాణాలు నిర్మించి ఇవ్వాలని వర్తక సఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. సీఎం తమకు ఇచ్చిన తొలి హామీ ని నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 20వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రిక్షేత్రాన్ని నమ్ముకుని సుమారు వంద ఏళ్ల నుంచి తమ తాతముత్తాల కాలంగా కొండపైన వ్యాపారం నిర్వహిస్తున్నామని, ఆలయ విస్తరణకు ఎల్లవేళలా సహకరిస్తూనే ఉన్నామని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలను ఆదుకునే విధంగా కొండపైన తమకు దుకాణాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. రిలే నిరాహారదీక్షలో యం నరేందర్‌రెడ్డి, శరత్‌, నాగరాజు, బాలుసా, కృష్ణ, ఎం. రాజు, రవి, ఉప్పలయ్య, నరేందర్‌, కిషోర్‌ కూర్చున్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సభ్యులు తడక వెంకటేష్‌, కొన్నె రమేశ్‌, గడ్డమీది దామోదర్‌, సంతోష్‌రెడ్డి, రాఘవుల ప్రసాద్‌, వడ్లోజు వెంకటేవ్‌, కిషోర్‌, శేఖర్‌, గడ్డమీది రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T06:02:48+05:30 IST