కొత్త ఠాణాలు ఏర్పాటయ్యేదెన్నడో..?

ABN , First Publish Date - 2020-02-28T11:50:34+05:30 IST

జిల్లాలో పోలీస్‌ స్టే షన్ల కొరత ఏర్పడింది. మూడున్నరేళ్ల క్రితం ప్రభు త్వం పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించింది.

కొత్త ఠాణాలు ఏర్పాటయ్యేదెన్నడో..?

 సరిపడా సిబ్బంది లేక తీవ్ర అవస్థలు

మరుగున పడుతున్న మహిళా కేసులు

ఊసేలేని క్రైం కంట్రోల్‌ స్టేషన్‌ఏర్పాటు

అమలుకునోచని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ హామీ


పెద్దపల్లిటౌన్‌, ఫిబ్రవరి 27: జిల్లాలో పోలీస్‌ స్టే షన్ల కొరత ఏర్పడింది. మూడున్నరేళ్ల క్రితం ప్రభు త్వం పెద్దపల్లిని జిల్లాగా ప్రకటించింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుకొని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ను ఏర్పాటుచేసింది. ఇప్పుడున్న పోలీస్‌ స్టేషన్లకు మరికొన్ని కొత్త పోలీస్టేషన్ల ఏర్పాటు, వివిధ విభాగాల పోలీస్‌స్లేషన్లను నెలకొల్పడంలో జాప్యం జ రుగుతోంది. దీంతో అన్ని విభాగాల కేసులను లా అండ్‌ఆర్డర్‌ పోలీస్టేషన్లోనే నమోదు చేయాల్సి వస్తోం ది. కేసులు ఛేదించేందుకు సుధీర్ఘకాలం పడుతోంది.


 జిల్లాలో 17 పోలీస్‌ స్టేషన్లు

జిల్లాలో 17 పోలీస్‌ స్టేషన్లున్నాయి. సుల్తానాబాద్‌, పొత్కపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, పెద్దపల్లి, జూలపల్లి, ధ ర్మారం, బసంత్‌నగర్‌, రామగుండం, ఎన్టీపీసి, గోదావరిఖని, యైుటింక్లయిన్‌, కమాన్‌పూర్‌, మంథని, ముత్తా రం, కొయ్యూరు పోలీస్‌స్టేషన్లతో పాటు కొత్తగా అంత ర్గాం, రామగిరి, పోలీస్‌ స్టేషన్లున్నాయి. జిల్లాగా ఏర్ప డిన తర్వాత పెద్దకల్వల క్యాంపులోని ఇరిగేషన్‌ శాఖ గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయించి పెద్దపల్లి డీసీపీ కార్యాల యంగా మార్చి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.


మరుగున పడుతున్న మహిళా కేసులు

జిల్లాకొక మహిళా పోలీస్‌స్టేషన్‌ నెలకొల్పాలన్న నిబంధనలున్నప్నటికీ చర్యలు చేపట్టకపోవడంతో మ హిళా కేసులు మరుగున పడుతున్నాయి. దీంతో మ హిళలు తమకు జరిగిన అన్యాయాలను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. పోలీస్టేషన్‌ వరకు రాలేక ఎన్నో కేసులు మరుగున పడుతున్నాయి. సమస్యలకు పరిష్కారం లభించక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. మహిళల్లో పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళాలనే భయం ఇంకా వెంటాడుతూనే ఉం ది. మహిళా పోలీస్‌స్టేషన్‌ ఉంటే ఆఫీసర్లు, కానిస్టేబు ళ్ళు మహిళలే కాబటి సమస్యలు చెప్పుకునే అవకాశం ఉండేది. దీంతో మహిళా కేసుల సంఖ్య తగ్గేదని పలువురు మహిళలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ హిళా పోలీస్‌స్టేషన్‌ లేకపోవడంపై మహిళలు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు.


మాటలకే పరిమితమైన రూరల్‌ పోలీస్‌స్టేషన్‌

జిల్లా కేంద్రంలో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి ఎన్నో ఏళ్ళుగా ప్రతిపాదనలు న్నా అమలుకు నోచుకోక మాటలకే పరిమితమయ్యిం ది. జిల్లా ఏర్పాటైన తర్వాత ధర్నాలు రాస్తారోకోలు పె రిగిపోయాయి. తరచూ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. బందోబస్తూ కల్పించాల్సిన విఐపీల రాక పోకలు జరుగుతుంటాయి. సభలు, సమావేశాలు పె ద్దఎత్తున జరుగుతుంటాయి. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయడం వల్ల జిల్లా కేంద్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, పరిరక్షణ సలువయ్యేదనే పలువురు అభిప్రాయపడుతున్నారు.


సీసీఎస్‌ ఊసేలేదు

దొంగతనాల నియంత్రణకు క్రైం కంట్రోల్‌ స్టేషన్‌ ను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. సీసీఎస్‌ లేకపోవడం వల్ల దొంగతనాల కేసులు పేరుకుపోతు న్నాయి. దొంగతనాలు జరిగినప్పుడు వాటిని చేధించేం దుకు రోజుల తరబడి ఆయా ప్రాంతాల్లో నిఘా వేసి నిందితులను తీసుకురావాల్సి ఉంటుంది. ఉన్న సిబ్బం ది ఇతర ప్రాంతాలకు వెళ్తే ఇక్కడ కొరత ఏర్పడుతుం ది. పెద్దఎత్తున జరిగే దొంగతనాలకు ఎక్కువ సమ యం కేటాయించాల్సి ఉంటుంది. వీరు కేవలం దొంగ తనాలపైన, సంచలనం సృషించిన కేసులపైన, ఆర్థిక నేరాలపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ విభాగం పో లీసులు దొంగతనాలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తుంటారు. కానీ సీసీఎస్‌ లేకపోవడంతో అవన్నీ జరగడంలేదు.


నిరంతరం ట్రాఫిక్‌ సమస్య..

జిల్లా కేంద్రాన్ని ట్రాఫిక్‌ సమస్య నిరంతరం వెంటా డుతోంది. జిల్లా ఏర్పడిన తరువాత ఇక్కడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ మంజూరు చేస్తామని అప్పటి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పెద్దపల్లి పర్యటనకు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. ఇక్కడి నుంచి వెంటనే ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటి వరకు కూడా మంజూరు కాకపోవడంతో రామగుండం నుంచి ఇక్క డికి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ తీసుకువచ్చారు. తాత్కలికంగా సీఐ, ఎస్సైతో పాటు కొంతమంది సిబ్బందిని ని యమించారు. జిల్లా కేంద్రం కావడం వల్ల పలు కార్యాలయాలకు, వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వారి సంఖ్య పెరిగింది.


ఇరుకు రోడ్లు ఉండడం వలన ట్రా ఫిక్‌ సమస్య తలెత్తుతోంది. గోదావరిఖని వైపు, కరీంనగర్‌వైపు వెళ్ళే వారికి రంగంపల్లి నుంచి శాంతినగర్‌ వరకు కేవలం మూడు కిలో మీటర్ల దాటి వెళ్లాలంటే అరగంటపైనే పడుతోంది. ఈ దూరంలో తరచూ ప్ర మాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు గాయాల పాలు కాగా, మరి కొందరు మృతిచెందిన ఘటనలు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌ వద్ద నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ అవుతూనే ఉంటుంది. మెయిన్‌రోడ్డు జెండా, మసీద్‌ చౌరస్తాల్లో ట్రాపిక్‌ సమస్య మరింత తీవ్రంగా ఉం టుంది. పండుగల సమయాల్లో చెప్పలేని పరిస్థితి నె లకొంటోంది. ఇప్పటికైనా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏ ర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.


నేరాల సంఖ్య తీవ్రంగా ఉన్నా..

గోదావరిఖనిలో నేరాల సంఖ్య తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ ఒకే పోలీస్‌స్టేషన్‌ ఉంది. ఇక్కడ ఎప్పుడు వివాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. హత్యలు, దాడులు, దొంగతనాలు భూతగాదాల కేసులు ఎక్కువ గా నమోదవుతుంటాయి. ఇప్పుడు టూటౌన్‌గా ఉన్న యైుటింక్లైయిన్‌ పోలీస్‌స్టేషన్‌ను త్రీటౌన్‌గా మార్చి గో దావరిఖనిలోనే రెండు టౌన్లుగాఏర్పాటు చేసేందుకు పోలీస్‌ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అ మలుకు నోచుకోక ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇక్కడ పోలీస్‌స్టేషన్‌ ఏర్పడితే పెద్ద ఎత్తున నేరాలు అదుపులోకి వస్తాయి.


ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూపులు

ఎలిగేడు మండలంలో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చే యాలని మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తు న్నారు. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులు, పోలీస్‌ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జూలపల్లి మండలం నుంచి విడిపోయి ఎలిగేడు మండలంగా ఏర్పడింది. ఇప్పటికీ జూలపల్లి పోలీస్‌స్టేషన్‌పరిధిలో నే ఉంది. ఇక్కడ జనాభాను బట్టి కొన్ని గ్రామాలను ఎలిగేడు పరిధిలోకి తీసుకువచ్చేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు పోలీస్‌ అధికారులు పేర్కొంటున్నారు. 


అరకొర సిబ్బంది..

ఉన్న పోలీస్‌ స్టేషన్లకు సరిపడా సిబ్బంది లేక అధి కారులు అవస్థలు పడుతున్నారు. కేసుల పరిష్కారం కోసం సమయం ఎక్కువ పడుతోంది. బాధితులు పో లీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే సిబ్బంది కొరతతో పోలీస్‌ అధికారులు ఒత్తిడికి గురవు తున్నారు. కేసుల విషయమై ఇతర ప్రాంతాల్లో విచార ణకు వెళ్లినప్పుడు ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది. స మయానికి భోజనం, నిద్ర లేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇప్పటికైనా నూతన పోలీస్‌ స్టేషన్లను ఏ ర్పాటు చేసి సరిపడా సిబ్బంది, అధికారులను నియ మించాలని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-02-28T11:50:34+05:30 IST