రైతుల సంక్షేమం కోసం పని చేయాలి

ABN , First Publish Date - 2020-10-22T06:02:47+05:30 IST

వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు రైతుల సంక్షేమం కోసం పని చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు

రైతుల  సంక్షేమం కోసం పని చేయాలి

వాక్సిన్‌ వచ్చే వరకు కరోనాతో సహజీవనం చేయాల్సిందే మంత్రి ఈటల రాజేందర్


హుజూరాబాద్‌, అక్టోబరు 21: వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు రైతుల సంక్షేమం కోసం పని చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం హుజూరాబాద్‌  వ్యవసాయ మార్కెట్‌లో పాలకవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఎస్సారెస్పీ నీటి కోసం కాలువల చుట్టూ తిరిగేవాళ్లమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి కష్టాలు తీరి వరిసాగు పెరిగిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ, డీసీఎంఎస్‌ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు.  కరోనా దెబ్బకు అగ్రరాజ్యలు కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యాయన్నారు. తెలంగాణలో కరోనా నుంచి 99 శాతం మంది కోలుకుంటున్నారన్నారు. కరోనా వైరస్‌ పూర్తిగా పోలేదని, వాక్సిన్‌ వచ్చేంత వరకు సహజీవనం చేయాల్సిందేనన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకు మేరుగైనా వైద్య సేవలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, వరంగల్‌ జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, కలెక్టర్‌ శశాంక, సుడ చైర్మన్‌ రామకృష్ణారావు, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ రమ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మార్కెటింగ్‌ జేడీ మల్లేశం, డీఎంవో పద్మావతి, తహసీల్దార్‌ బావ్‌సింగ్‌ పాల్గొన్నారు.


మంత్రికి బీజేపీ కౌన్సిలర్ల వినతి

హుజూరాబాద్‌ రూరల్‌: హుజూరాబాద్‌లో అభివృద్ధి పనులకు ప్రారంభానికి వచ్చిన మంత్రి ఈటల రాజేందర్‌కు బుధవారం బీజేపీ కౌన్సిలర్లు వినతి పత్రం సమర్పించారు. పట్టణంలోని మిషన్‌ భగీరథ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పైళ్ల వెంకట్‌రెడ్డి, గనిశెట్టి ఉమామహేశ్వర్‌, బీజేపీ నాయకులు దండ విక్రమ్‌రెడ్డి, నల్ల సుమన్‌ పాల్గొన్నారు.


జమ్మికుంటలో..

జమ్మికుంట: రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా నష్టం జరగకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూసుకుంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆన్నారు. 


బుధవారం మండలంలోని తనుగుల గ్రామంలో 83 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. విలాసాగర్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిరిశేటి మధుకర్‌ కుటుంబాన్ని పరామర్శించారు.


అనంతరం జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హజరయ్యారు. మార్కెట్‌ కమిటి చైర్మన్‌ వాల బాలకిషన్‌రావు, వైస్‌ చైర్మన్‌ ఎర్రంరాజు సురేందర్‌రాజు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం అనంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, వైస్‌ చైర్మన్‌ దేశిని స్వప్న, కేడీసీసీ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పొనగంటి సంపత్‌, జట్పీటీసీ డాక్టర్‌ శ్రీరాం శ్యాం, రైస్‌ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్‌, జిన్నింగ్‌ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దొనకొండ మల్లారెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి పద్మావతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-22T06:02:47+05:30 IST