Abn logo
Sep 27 2021 @ 00:54AM

సహకార సంఘాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి

మహాజన సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 

ఎలిగేడు, సెప్టెంబరు 26 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి అన్నారు. మండలం కేంద్రంలోని ప్రాథమిక సహకార  సంఘం 127వ మహాసభ పీఏసీఎస్‌ చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి దాసరి ముఖ్యఅతిథిగా హాజరై సభ్యులు, రైతులను ఉద్ధేశించి ఆయన మాట్లాడారు. 1956లో అప్పటి భారత ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక సహకార సంఘాల ను ప్రవేశపెట్టి వ్యవసాయదారులకు లాభం చేకూర్చాడని చెప్పారు. 2019 -20లో సంఘ ఆదాయం 4063662.89, నికర లాభం 2285691.39, 2012 -13లో సీ గ్రేడ్‌ ఉండగా 2013-14,2014-15 బీ గ్రేడ్‌ ఉండగా 2019-20 నుం చి ఎ గ్రేడ్‌ రావడానికి కృషి చేసిన పాలకవర్గాన్ని ఆయన అభినందించారు. సంఘ పరిధిలోని గ్రామాల్లోని రైతులు, ప్రజల సౌకర్యార్థం పెట్రోల్‌ బంక్‌, మినరల్‌వాటర్‌, సూపర్‌మార్కెట్‌, ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ షోరూం, 4 గ్రామాల్లో గోదాంల నిర్మాణానికి భూములను కొనడం ఈ సొసైటీ అభివృద్ధికి నిదర్శన మని, చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి కృషి పట్టుదలకు నిదర్శనంగా మిగిలిపో యాడని ఆయన పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ ధీర్ఘ, స్వల్పకాలిక రు ణాలను అందిస్తూ, ఎరువులు, ఫర్టిలైజర్‌, ట్రాక్టర్‌, గొర్రెలు, మేకలు, హార్వె స్టర్‌, మిని ట్రాక్టర్‌, ప్యాడీ ట్రాన్స్‌ప్లాంటర్స్‌ను అందించి వారిని సాంకేతిక వైపు నడిపివ్వడం ఈ సంఘం సభ్యుల అదృష్టంగా భావించాలని అన్నారు. తెలంగాణ మన అందరి పార్టీ అని ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌లో రైతు లు పండించిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం తప్పకుండా కోనుగోలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ రావు, కేడీసీసీ చైర్మన్‌ రవిందర్‌రావు, ప్రాథమిక సహకార సంఘం రాష్ట్ర, జిల్లా ఉన్నాతాధికారుల కృషి అపూర్వ మని వారిని ఈ సంఘం పరిధిలోని ప్రజాప్రతినిఽధులు, పాలకవర్గం ఎప్పు డు రుణపడి ఉంటామని చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్‌రావు, జడ్పీ వైస్‌చైర్మ న్‌ మండిగ రేణుక రాజనర్సు, సర్పంచ్‌ బూర్ల సింధూజ, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, జూల పల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మీనర్సయ్య, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ గణపతిరెడ్డి, సర్పంచ్‌లు అర్షనపల్లి వెంకటేశ్వరరావు, మాడ కొండాల్‌రెడ్డి, పెద్దోళ్ల ఐలయ్య, చిలుముల సౌమ్య, సింగిరెడ్డి ఎల్లమ్మ, శ్యాం, ఎంపీటీసీలు కొత్తిరెడ్డి ప్రేమలత, తూడి లక్ష్మీ, పాలకవర్గ సభ్యులు, సీఈఓ విక్రమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.