అమర జవాన్‌ జశ్వంతరెడ్డికి శౌర్యచక్ర

ABN , First Publish Date - 2022-01-26T09:06:51+05:30 IST

ఆర్మీలో సుబేదారుగా పనిచేస్తూ ఉగ్రవాదుల దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన గుంటూరు జిల్లా వాసి మరుప్రోలు జశ్వంతరెడ్డికి ప్రతిష్ఠాత్మక శౌర్యచక్ర పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ఆయనకు ఈ

అమర జవాన్‌ జశ్వంతరెడ్డికి శౌర్యచక్ర

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి), బాపట్లరూరల్‌,  జనవరి 25: ఆర్మీలో సుబేదారుగా పనిచేస్తూ ఉగ్రవాదుల దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన గుంటూరు జిల్లా వాసి మరుప్రోలు జశ్వంతరెడ్డికి ప్రతిష్ఠాత్మక శౌర్యచక్ర పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. బాపట్ల మండలం, ధరివాదకొత్తపాలెం గ్రామానికి చెందిన జశ్వంతరెడ్డి.. 2016లో ఆర్మీలో చేరారు. గతేడాది జూలై 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించారు. దీంతో ఆయనకు శౌర్యచక్ర అందిస్తున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా జశ్వంతరెడ్డి తండ్రి మరుప్రోలు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణకై తన కుమారుడు ప్రాణాలను అర్పించడం గర్వంగా ఉందని తెలిపారు. జశ్వంతరెడ్డికి శౌర్యచక్ర అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆర్మీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు.

Updated Date - 2022-01-26T09:06:51+05:30 IST