Abn logo
Apr 7 2020 @ 06:20AM

వైద్య సిబ్బందికి షోకాజ్‌

రింగురోడ్డు, ఏప్రిల్‌ 6 : ఇతర జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్న వైద్యులకు ఉన్నతాధికారులు సోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. కరోనావైరస్‌తో ప్రపంచమంతా అలజడిగా ఉన్న పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు స్వీయ నియంత్రణపై అవగాహన చేయాల్సిన వైద్యులు కొందరు ఇతర జిల్లాల నుంచి వస్తూపోతూ ఉన్నారు. స్థానికంగా ఉండి పనిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. కొంతమంది ముఖ్యంగా వైద్య శాఖలో పనిచేసే సిబ్బంది ప్రతీరోజు తమ స్వస్థలాలకు వెళ్లి వస్తున్నారు.


శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి కూడా రాకపోకలు సాగిస్తున్నారు. దీనివల్ల విధులకు సకాలంలో హాజరుకాలేకపోతున్నారు. ఇదే సమయంలో వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌కు ఫిర్యాదు అందింది. దీనికి స్పందించిన కలెక్టర్‌  వైద్యశాఖలో పనిచేస్తున్న 20 మందికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఇదే విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌వీ రమణమకుమారి వద్ద ప్రస్తావించగా షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ధ్రువీకరించారు. 

Advertisement
Advertisement
Advertisement